ETV Bharat / international

ముఖం చూసి డబ్బులిచ్చే యంత్రాలొచ్చాయ్​! - ఏటీఎం

పిన్​ లేకుండానే ఏటీఎంలో నుంచి డబ్బులు తీసుకునే సౌలభ్యాన్ని కల్పించనుంది స్పెయిన్​కు చెందిన కైక్సా బ్యాంకు. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా ఫేషియల్​ రికగ్నిషన్​​​ సాంకేతికతతో ఏటీఎంలను తయారుచేసింది.

ఫేషియల్​ రికగ్నిషన్ ఏటీఎంలు
author img

By

Published : May 21, 2019, 6:29 PM IST

ఫేషియల్​ రికగ్నిషన్ ఏటీఎంలు

ఇప్పటి వరకు ఏటీఎంలో డబ్బులు తీసుకోవాలంటే పిన్​ నంబరు తప్పనిసరి. కానీ ఇక నుంచి పిన్​ అవసరం లేదంటోంది స్పెయిన్​కు చెందిన కైక్సా బ్యాంకు. ప్రపంచంలో తొలిసారిగా ఏటీఎంల్లో ఫేషియల్​ రికగ్నిషన్​​ సాంకేతికతను వినియోగంలోకి తెచ్చింది ఈ బ్యాంకు. పిన్​ అవసరం లేకుండానే డబ్బులు విత్​ డ్రా చేసుకునే సదుపాయాన్ని అతి త్వరలో ఖాతాదారులకు అందుబాటులోకి తేనుంది. ఈ ఏడాది పూర్తయ్యే సరికి స్పెయిన్​లోని మొత్తం 4,409 ఏటీఎంల ద్వారా ఈ సదుపాయం కల్పించేందుకు యత్నిస్తున్నారు కైక్సా బ్యాంకు అధికారులు.

రెండింటిలో ఏదైనా..

స్పెయిన్ వ్యాప్తంగా ఫేషియల్​ రికగ్నిషన్​​​ సాంకేతికతతో పాటు పాత పిన్​ పద్ధతికి అనుకూలంగా ఉండేలా ఏటీఎంలను సిద్ధం చేస్తున్నారు కైక్సా బ్యాంకు అధికారులు. తద్వారా వినియోగదారులు వారికి నచ్చిన పద్ధతిలో డబ్బును తీసుకోవచ్చు. ఇందుకోసం ఖాతాదారులందరూ ముందుగానే వారి ముఖ కవళికలను బ్యాంకులో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అత్యాధునిక కెమెరాలను ఈ ఫేషియల్​ రికగ్నిషన్​​ సాంకేతికత​లో వినియోగించారు.

70 శాతం మంది సాంకేతికతకే మొగ్గు

నూతన సాంకేతికతో వస్తోన్న ఏటీఎంలపై ఖాతాదారుల అభిప్రాయం తెలుసుకుంది కైక్సా బ్యాంకు. భద్రత, వేగం, సౌలభ్యం తదితర అంశాలపై జరిపిన సర్వేలో 70 శాతం మంది పిన్​కు బదులుగా ఫేషియల్​ రికగ్నిషన్​​ సాంకేతికతకే మొగ్గు చూపారని అధికారులు తెలిపారు.

వీరి సహకారంతోనే అభివృద్ధి

ఏటీఎంలను తయారుచేసే ఫుజిత్సూ, ఫేస్​ఫై సంస్థల సహకారంతో ఫేషియల్​​ రికగ్నిషన్​​​ సాంకేతికతను అభివృద్ధి చేసింది కైక్సా బ్యాంకు.
ప్రపంచంలో తొలిసారి 2012లో కాంటాక్ట్​లెస్​ ఏటీఎంలను వినియోగంలోకి తెచ్చిన బ్యాంకు కూడా కైక్సానే. ఇప్పుడు ఫేషియల్​ రికగ్నిషన్​​​ను వినియోగించిన మొదటి బ్యాంకుగా రికార్డు సాధించింది. కైక్సా బ్యాంకుకు స్పెయిన్​లో మొత్తం 13.7 మిలియన్ల​ మంది ఖాతాదారులున్నారు. స్పెయిన్​లో మూడో అతిపెద్ద బ్యాంకు కైక్సా.

" ఇది ఎంతో సానుకూల విషయమని నేను భావిస్తున్నా. ఎందుకంటే నేను మొబైల్​ ఫోన్లో వినియోగించే సాంకేతికతకు నన్ను మరింత దగ్గర చేసింది. నేను ఇక నుంచి పిన్​ వినియోగించాల్సిన అవసరం లేదు. అందుకు బదులుగా వేలిముద్ర లేదా ఫేస్​ రికగ్నిషన్​​​ను ఉపయోగించొచ్చు. ఇది ఎంతో ఆధునికమైందని అనుకుంటున్నాను. అలాగే పటిష్ఠ భద్రతతో కూడుకున్నది."
- మార్సిడస్​ కాసెరెస్​, కైక్సా ఖాతాదారుడు

Intro:Body:

kjkjkj

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.