ఎప్పుడైనా మీరు జెప్పెలిన్ విమానం చూశారా? ఈ భారీ విహంగంలోంచి మంచు పర్వతంపై దిగారా? వామ్మో అనుకుంటున్నారా? ఇక్కడితోనే అయిపోలేదు. అదే జోరుతో మంచు పర్వతంపై స్కీయింగ్ చేశారా? మన వల్ల కాదు అనుకుంటున్నారా?
అవును! ఇది అందరి వల్లా కాదు. కానీ ఓ ముగ్గురు జర్మన్ ఔత్సాహికులు ఇందుకు పూనుకున్నారు. స్టీఫెన్ అగర్, ఆండ్రియాస్, ఫాబియన్ కలిసి ఈ సాహసం చేశారు. జెప్పెలిన్ విమానంలో జర్మనీ నుంచి ఆస్ట్రియాలోని క్లేనేర్ వాల్కాస్టిల్ పర్వత శిఖరం వద్దకు చేరుకున్నారు. పర్వత శిఖరం 50 మీటర్ల ఎత్తు నుంచి ర్యాప్లింగ్, ఆ తర్వాత స్కీయింగ్ చేశారు. అందరిచేత ఔరా అనిపించారు.