బ్రిటన్ బ్రెగ్జిట్ గడువును స్వల్పకాలంపాటు పొడిగించడానికి ఐరోపా సమాఖ్య అంగీకరించింది. యూకే పార్లమెంట్ ఆమోదం తెలిపితేనే మే 22 వరకు బ్రెగ్జిట్ గడువు పొడిగిస్తామని షరతు విధించింది. ఒకవేళ ప్రధాని థెరిసా మే ప్రతిపాదనను బ్రిటన్ చట్టసభ్యులు తిరస్కరిస్తే బ్రెగ్జిట్ గడువు ఏప్రిల్ 12తోనే ముగియనుంది.
బ్రస్సెల్స్లో జరిగిన ఈయూ సదస్సులో బ్రిగ్జిట్ విషయంపై అనిశ్చితి నెలకొంది. అయితే బ్రిగ్జిట్ గడువు పొడిగింపు ప్రతిపాదనకు ప్రధాని థెరిసా మే అంగీకరించారని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ తెలిపారు.
ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలగడానికి ఉద్దేశించింది బ్రెగ్జిట్. ఇందుకు ముందుగా నిర్దేశించుకున్న గడువు మార్చి 31. ఈలోగా ఐరోపా సమాఖ్యతో బ్రిటన్ ఒప్పందం చేసుకోవాల్సి ఉన్నా... రాజకీయ ఏకాభిప్రాయం లేక సాధ్యపడలేదు.