ETV Bharat / international

బ్రెగ్జిట్​ ఒప్పందానికి బ్రిటన్​ తూట్లు- ఈయూ నోటీసులు! - uk

బ్రెగ్జిట్​ ఒప్పందానికి బ్రిటన్​ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని ఆరోపించింది ఐరోపా సమాఖ్య(ఈయూ). ఈ మేరకు ఆ దేశంపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. నవంబర్​ చివర్లోగా సమాధానం ఇవ్వాలని బ్రిటన్​కు నోటీసులు జారీ చేసింది.

EU takes legal action against UK over planned Brexit
బ్రెగ్జిట్​ ఒప్పందానికి బ్రిటన్​ తూట్లు-ఈయూ నోటీసులు!
author img

By

Published : Oct 2, 2020, 8:16 AM IST

బ్రిటన్‌పై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది ఐరోపా సమాఖ్య(ఈయూ). యూకే పార్లమెంటు చేసిన అంతర్గత మార్కెట్‌ చట్టంలోని కొన్ని అంశాలు బ్రెగ్జిట్‌ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నాయని ఈయూ ఆరోపించింది. వివాదాస్పద అంశాలను చట్టం నుంచి తొలగించాలంటూ బ్రిటన్‌కు ఈయూ ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసింది.

ఈ నేపథ్యంలోనే బ్రిటన్‌కు నోటీసులు జారీ చేసింది. నవంబర్‌ చివరిలోపు సమాధానం ఇవ్వాలని కోరింది. ఈయూ ఆరోపణలపై బ్రిటన్‌ ప్రభుత్వ ప్రతినిధి స్పందించారు. అంతర్గత మార్కెట్‌ చట్టం యూకేలోని వివిధ ప్రాంతాల మధ్య వాణిజ్యాన్ని రక్షించుకునేందుకు ఉద్దేశించిందని స్పష్టం చేశారు. ఈయూ నోటీసులపై.. బ్రిటన్‌ సరైన సమయంలో జవాబిస్తుందని చెప్పారు.

స్వతంత్రంగా జీవించాలన్న బ్రిటన్​ ఆకాంక్ష బ్రెగ్జిట్​ ఒప్పందంతో నెరవేరింది. ఐరోపా సమాఖ్య నుంచి విడిపోయి.. వాణిజ్యం, సరిహద్దు అంశాల్లో​ స్వతంత్ర దేశంగా ఉంటోంది బ్రిటన్​.

వాణిజ్య అవసరాల కోసం ఏర్పడిన ఐరోపా సమాఖ్యలో బ్రిటన్​ 1973లో చేరింది. కూటమి నుంచి వైదొలిగిన మొదటి దేశం యూకేనే.

ఇదీ చూడండి: బ్రెగ్జిట్​ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.