ETV Bharat / international

రూ. 12కే ఇల్లు.. ఎక్కడో తెలుసా? - రూ.12కే ఇల్లు క్రొయేషియా

సొంతింటి కలలు ఉన్నవారు వీలైనంత తక్కువ ధరకు మంచి ఇల్లు దొరికింతే బాగుండని ఆశిస్తారు. అలాంటి వారి కోసం ఓ బంపర్​ ఆఫర్​ ఉంది. ఈ ఆఫర్​లో ఇల్లు లక్షలు, వేలల్లో కూడా కాదు అంతకంటే తక్కువకే వచ్చేస్తుంది. ఈ అవకాశం భారత్​లో కాదండి.. క్రొయేషియాలో. మరి ఆ విశేషాలు తెలుసుకుందామా?

croatia houses for sale rs 12, రూ.12కే ఇల్లు క్రొయేషియా
ఆఫర్​ అదిరింది.. రూ.12కే ఇల్లు, ఉద్యోగం
author img

By

Published : Jun 13, 2021, 5:35 AM IST

Updated : Jun 13, 2021, 5:54 AM IST

ఓ ఇల్లును సొంతం చేసుకోవాలంటే రూ.లక్షలు, రూ.కోట్లతో కూడుకున్న పని. అయితే.. క్రొయేషియాలోని లెగ్రాడ్‌ పట్టణం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. తమ పట్టణంలో కేవలం 1 కునా (రూ.12)కే ఇల్లు విక్రయిస్తామని ప్రకటన చేసింది.

ఎందుకు అంత చౌక?

ఈ ఆఫర్​ను ప్రకటించడానికి బలమైన కారణం లేకపోలేదు. శతాబ్దం క్రితం ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యం విచ్ఛిన్నం కావడం వల్ల లెగ్రాడ్‌లో జనాభా గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. చాలామంది గృహాలను వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఆ గృహాలను కేవలం 1 కునా (రూ.12)కే విక్రయించాలని ఆ పట్టణ పురపాలక శాఖ నిర్ణయం తీసుకుంది. కొత్త నివాసితులను ఆకర్షించేందుకు ఈ ఆఫర్‌ ప్రకటించింది.

కండీషన్స్​ అప్లై..

హంగేరి సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ పట్టణంలో ప్రస్తుతం 2 వేల 250 మంది నివాసితులు ఉన్నారు. ఇల్లు కొనాలనుకునే వారికి కొన్ని నిబంధనలు పెట్టింది. 45 ఏళ్ల లోపు ఉండి ఆర్థికంగా బలంగా ఉన్నవారు 15 ఏళ్ల పాటు ఉంటామని హామీనిస్తే ఇళ్లను విక్రయిస్తోంది.

ఆఫర్​కు స్పందన..

లెగ్రాడ్​ పట్టణం ప్రకటించిన ఆఫర్​కు విదేశాల నుంచి కూడా మంచి స్పందనే వచ్చింది. ఇప్పటివరకు 19 ఇళ్లను అధికారులు విక్రయించారు. రష్యా, ఉక్రెయిన్, టర్కీ, అర్జెంటీనా దేశస్థులు కూడా ఇక్కడ ఇళ్లను కొన్నారు. ఇళ్లు కొన్నవారికి ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నారు.

ఇదీ చదవండి : కరెన్సీ కట్టలతో పబ్​ అలంకరణ!

Last Updated : Jun 13, 2021, 5:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.