ETV Bharat / international

భయపెడుతున్న ఏవై.4.2 వేరియంట్​- శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? - ay 4.2 in india

కరోనా వైరస్(Coronavirus news)​ కథ ముగిసింది అనుకునేలోపు కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. జన్యుపరమైన మార్పులు చేసుకుంటూ.. ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఇప్పుడు.. మరో రకం ఏవై. 4.2 రకం (AY covid variant) కొవిడ్​ వేరియంట్​ గురించి మాట్లాడుకోవాలి. ఈ కొత్త స్ట్రెయిన్​ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆందోళన నెలకొంది. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది డెల్టా, డెల్టా ప్లస్​ కంటే ప్రమాదకరమా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

new AY.4.2 lineage of the coronavirus
భయపెడుతున్న ఏవై.4.2 వేరియంట్
author img

By

Published : Oct 26, 2021, 6:15 PM IST

Updated : Oct 28, 2021, 7:38 PM IST

కరోనా మహమ్మారి(Coronavirus news).. ప్రపంచ దేశాలను ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదు. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ.. ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. జన్యు పరిణామ క్రమాల్లో మార్పులు చేసుకుంటూ.. వైరస్​ను వ్యాప్తి చేస్తున్నాయి. అన్ని వేరియంట్లలోకెల్లా డెల్టా రకం.. ఎంతలా భయపెట్టిందో తెలుసు. ఆ తర్వాత దాని నుంచి డెల్టా ప్లస్..​ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉత్పరివర్తనలు వెలుగుచూశాయి.

ఇప్పుడు ఏవై.4.2.(AY covid variant) కేసులు పెరిగిపోతున్నాయి. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా సంక్రమిస్తుంది?

అసలు వైరస్​ ఎలా మారుతుంది? వేరియంట్లు ఎలా పుట్టుకొస్తున్నాయి అని పరిశోధించడానికి.. ఇంగ్లాండ్​లోని నార్తుంబ్రియా విశ్వవిద్యాలయం బృందం ఏప్రిల్​లో ప్రయత్నించింది. అలా ఏవై.4.2 మూలాలు బయటపడ్డాయి. ముఖ్యంగా భారత్​కు వెళ్లివచ్చిన ప్రయాణికుల నమూనాలను పరిశోధకులు విశ్లేషించారు. అప్పుడే.. భారత్​లో కరోనా బీ.1.617 రకం (AY 4.2 coronavirus) వేరియంట్​ విజృంభించినట్లు వారికి తెలిసింది. బీ.1.617నే ఆ తర్వాత డబ్ల్యూహెచ్​ఓ.. డెల్టా వేరియంట్​గా నామకరణం చేసింది. భారత్​లో కరోనా సెకండ్​ వేవ్​కు డెల్టానే (Delta variant news) కారణం.

అయితే.. పరిశోధకులు సేకరించిన నమూనాలు డెల్టా వేరియంట్​తో సరిపోలలేదు. అంటే.. వైరస్​లో ఎన్నో ఉత్పరివర్తనాలు ఉన్నాయని, తాము పరిశోధించిన వాటిలో బీ.1.617కు చెందిన ఎన్నో ఉపరకాలున్నాయని తెలిసొచ్చింది.

ఈ డెల్టాలో(Delta variant news) తదనంతరం.. ఎన్నో జన్యుపర మార్పులు(Coronavirus news) చోటుచేసుకున్నాయని.. వాటిలో మరో రకమే ఇప్పుడు వెలుగుచూసిన 'ఏవై'(AY covid variant) అని గుర్తించారు. ఈ ఒక్క ఏవైలోనే (AY 4.2 coronavirus) 75 విభిన్న ఉపవంశాలు ఉన్నాయని, వీటిల్లో ఏవై.4 రకం యూకేను అతలాకుతలం చేస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. గత కొద్దినెలలుగా.. అక్కడ వెలుగుచూస్తున్న కొత్త కేసుల్లో 63 శాతానికిపైగా వీటివే.

ఏవై.4.2

ఏవై.4లోని ఉపరకమే ఏవై.4.2 కరోనా వేరియంట్​(AY covid variant). సెప్టెంబర్​ చివర్లో దీనిని గుర్తించారు. యూకేలో మాత్రం జూన్​ నెలలోనే వెలుగుచూసినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్​ స్పైక్​ ప్రొటీన్​ మ్యుటేషన్లు అయిన ఏ222వీ, వై145హెచ్​ల సమ్మేళనంగా ఈ కొత్త వేరియంట్​ పుట్టుకొచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇందులో ఏ222వీ మ్యుటేషన్​.. గతేడాది స్పెయిన్​లో ఉద్భవించినట్లుగా భావిస్తున్న బీ.1.177 ఉపరకంలో వెలుగుచూసింది. ఇది ఎక్కువగా.. పర్యటకుల నుంచే దేశంలో వ్యాప్తి చెందింది. కాబట్టి.. వై145హెచ్​ అనే కొత్త మ్యుటేషన్​ కారణంగానే ఏవై.4.2 రకం(AY 4.2 coronavirus) కేసులు నమోదవుతున్నట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

వై145హెచ్​ మ్యుటేషన్.. రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే.. దీనిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉన్నట్లు వెల్లడించారు. డెల్టా, డెల్టా ప్లస్​ వేరియంట్లపై వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేయలేదని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. ఏవై.4.2 గురించి తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాలని నిపుణులు చెబుతున్నారు.

అయితే.. ఏవై 4.2. తరహా కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. గత 28 రోజుల్లో యూకేలోని కొత్త కేసుల్లో 9 శాతం ఈ ఉపరకానివే. ఇతర ఐరోపా దేశాలైన డెన్మార్క్​, జర్మనీ, ఐర్లాండ్​లకూ ఈ వైరస్​ పాకింది.

భారత్​లో..

మన దేశంలోనూ (AY 4.2 in India) ఏవై రకం(AY covid variant) కరోనా వేరియంట్​ విస్తరిస్తోంది.

  • మధ్యప్రదేశ్​ ఇందోర్​లో ఆరుగురికి ఈ వైరస్(Coronavirus news)​ సోకినట్లు వైద్యులు సోమవారం నిర్ధరించారు. వీరంతా వ్యాక్సిన్​ రెండు డోసులు తీసుకున్నారని చెప్పారు. కరోనా మహమ్మారి పుట్టుకొచ్చినప్పటి నుంచి ఈ తరహా కేసులే చూడలేదని పేర్కొన్నారు.
  • కర్ణాటకలో ఏవై.4.2 రకం(AY covid variant) కేసులు ఏడు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఇది రాష్ట్రంలో మూడో దశ విజృంభణకు (Corona third wave in India) దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
  • తెలంగాణలోనూ జూన్​లో ఏవై.4.2 వేరియంట్​ కేసు నమోదైందని అధికారులు ధ్రువీకరించారు. అయితే, ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా గుర్తించలేదని తెలిపారు.

తొందరపాటే..

మరిన్ని కొత్త ఉపవేరియంట్లు పుట్టుకొచ్చేందుకు ఏవై రకం దారితీస్తుందా అన్నదానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. అవును అని ఇప్పుడే అనడం తొందరపాటే అవుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. దీనిపై నిరంతర నిఘా అవసరం అంటున్నారు.

ఇవీ చూడండి: చైనాపై కరోనా పంజా- అక్కడ మళ్లీ లాక్​డౌన్​

రష్యాలో కరోనా కల్లోలం- 'డెల్టా'ను మించి..

corona variant: తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతోన్న కొత్త రకం కరోనా

Last Updated : Oct 28, 2021, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.