ETV Bharat / international

'నెమ్మదిగా వ్యాపించినా కరోనా చాలా ప్రమాదకర వైరస్​' - corona virus latest news

కరోనా వైరస్​ నెమ్మదిగా వ్యాపించినా చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆరోగ్యంగా ఉన్నవారిపై ఎక్కువ ప్రభావం ఉండదని సంస్థ డైరెక్టర్​ జనరల్​ టెడ్రోస్​ తెలిపారు.

corona
కరోనా
author img

By

Published : Mar 5, 2020, 4:42 AM IST

కరోనా వైరస్‌.. ఫ్లూ కంటే నెమ్మదిగా వ్యాపిస్తుంది కానీ ఫ్లూకంటే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రొస్‌ కరోనా గురించి పలు విషయాలు వెల్లడించారు. కరోనా అన్ని వ్యాధుల్లాంటిది కాదని.. విచిత్ర లక్షణాలున్న వైరస్​ అని తెలిపారు.

"ప్రపంచ వ్యాప్తంగా సేకరించిన గణాంకాల ఆధారంగా వ్యాధిని అంచనా వేస్తున్నాం. వైరస్‌ ఫ్లూకంటే నెమ్మదిగా వ్యాపిస్తున్నప్పటికీ ఇది చాలా ప్రమాదకరం. ఆరోగ్యంగా ఉన్నవారిని ఎక్కువగా ప్రభావితం చేయలేదు. కరోనా అన్ని వ్యాధుల్లాంటిది కాదు. విచిత్రమైన లక్షణాలున్న వైరస్‌ ఇది. కరోనా కేసుల్లో కేవలం ఒకశాతం రోగుల్లో మాత్రం లక్షణాలు కనిపించడం లేదు. కానీ, రెండు రోజుల్లోనే వేగంగా వృద్ధి చెందుతున్నాయి. వ్యాధిని నయం చేయడానికి ఇప్పటి వరకూ టీకాలు కానీ.. చికిత్స విధానం కానీ కనుగొనలేదు. మన జాగ్రత్తతోనే వైరస్‌ నుంచి దూరంగా ఉండగలం."

- టెడ్రోస్​, డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్​ జనరల్​

ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 90వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 3,100కుపైగా మంది మరణించారు. చైనాలో గత 24 గంటల్లో 129 కేసులు నిర్ధరణ అయ్యాయి. చైనాలో జనవరి 20తో పోల్చితే కరోనా వ్యాప్తిలో కొంత తగ్గుముఖం కనిపిస్తోంది. అందులో 80 శాతం కేసులు దక్షిణ కొరియా, ఇరాన్‌, ఇటలీల్లోనే నమోదయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.