ETV Bharat / international

భారత్​ కోసం బ్రిటన్​ యువరాజు అత్యవసర నిధి - దక్షిణాసియా దేశాల కోసం అత్యవసర నిధి ఏర్పాటు చేసిన బ్రిటన్​ యువరాజు

దక్షిణాసియా దేశాలకు సాయం చేసేందుకు అత్యవసర నిధిని ఏర్పాటు చేశారు బ్రిటన్​ యువరాజు చార్లెస్​. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారత్​, పాక్​, బంగ్లాదేశ్​, శ్రీలంక వంటి దేశాల కోసం తన ట్రస్ట్​ ద్వారా విరాళాలను సేకరించనున్నారు.

COVID-19: Prince Charles launches emergency fund for India, South Asia
భారత్​ కోసం బ్రిటన్​ యువరాజు అత్యసవర నిధి
author img

By

Published : Apr 24, 2020, 8:16 PM IST

కరోనా సంక్షోభం నేపథ్యంలో భారత్​, పాకిస్థాన్​, బంగ్లాదేశ్​, శ్రీలంక వంటి దక్షిణాసియా దేశాలకు ఆర్థిక సాయం చేసేందుకు పూనుకున్నారు బ్రిటన్​ ప్రిన్స్​ చార్లెస్​. ఈ మేరకు బ్రిటీష్​​ ఆసియన్​​ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యవసర నిధిని ఏర్పాటు చేశారు.

ఆర్థిక సాయం..

మహమ్మారిని నిలువరించేందుకు బ్రిటన్​-ఆసియా దేశాలు పరస్పరం సహకరించుకోవడాన్ని ప్రశంసించారు యువరాజు​. ఈ అత్యవసర నిధికి తమ వంతు విరాళాలు అందజేయాలని ప్రవాసులను కోరారు. ఫలితంగా తమ సొంత దేశాల్లో వైరస్​తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు కొంత మేర సహాయం చేయగలరన్నారు.

"కరోనా సంక్షోభం నుంచి బ్రిటన్​ కోలుకోవడానికి బ్రిటీష్​ ఆసియా కమ్యూనిటీ కీలకంగా పనిచేస్తోందని నాకు తెలుసు. ఆరోగ్య సేవలు, స్వచ్ఛంద కార్యక్రమాల్లో మీరంతా భాగస్వాములవుతున్నారు. విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నవారికి, పేదవారికి, బలహీన వర్గాలకు ప్రాథమిక అవసరాలను తీర్చడానికి ఈ ట్రస్ట్​​ ద్వారా నా మద్దతు ఇస్తున్నాను".

- చార్లెస్, బ్రిటన్​ యువరాజు​

ఇబ్బందులు పడుతున్నారు!

నిధుల సమీకరణకు విరాళాల కోసం విజ్ఞప్తి చేశారు చార్లెస్​. దక్షిణాసియా అంతటా 40 లక్షల మంది చిన్నారులు తిండిలేక ఇబ్బందిపడుతున్నారని ఆయన చెప్పారు. అంతేకాకుండా 40 కోట్లకు పైగా రోజువారీ కార్మికులు తమ జీవనోపాధి కోల్పోయి.. ఎలాంటి ఆదాయంతో లేక కష్టాల్లో ఉన్నారన్నారు. వారిని ఆదుకునేందుకు ఈ నిధి ఉపయోగపడుతుందని చెప్పారు.

2007లో పేదరికానికి వ్యతిరేకంగా పని చేయడానికి బ్రిటీష్​​ ఆసియన్​​ ట్రస్ట్ ప్రారంభించారు చార్లెస్​. 71 ఏళ్ల ఈ యువరాజు.. ఇటీవలె కరోనా బారి నుంచి క్షేమంగా బయటపడ్డారు.

ఇదీ చూడండి: కరోనాపై పోరుకు నాసా 'వైటల్' అస్త్రం!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.