ETV Bharat / international

గుండె సమస్యలున్న వారికి కరోనాతో మరణం ముప్పు! - కరోనా వల్ల గుండె సమస్యలు

హృద్రోగాలున్న కరోనా బాధితులు ఆసుపత్రి పాలైనప్పుడు... వారి పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. కొవిడ్​తో వీరికి మరణం ముప్పు ఎక్కువేనని వెల్లడైంది.

COVID-19 patients with underlying heart conditions at higher death risk, study confirms
గుండె సమస్యలున్న వారికి కరోనాతో మరణం ముప్పు!
author img

By

Published : Aug 16, 2020, 8:50 AM IST

Updated : Aug 16, 2020, 9:56 AM IST

గుండె రుగ్మతలున్న కొవిడ్‌-19 బాధితులు ఆసుపత్రి పాలైనప్పుడు వారి పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని ఇటలీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. కరోనా వైరస్‌తో వీరికి మరణం ముప్పు ఎక్కువని కూడా తేలింది. ఇటలీలోని మ్యాగ్నా గ్రేషియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం సాగించారు.

కొవిడ్‌ బాధితుల్లో చాలా మందికి స్వల్ప అస్వస్థత మాత్రమే కలుగుతుంది. మిగతావారిలో అది తీవ్ర న్యుమోనియా.. మరికొందరిలో మరణానికి దారితీయవచ్చు. దీనిపై పరిశోధకులు దృష్టిసారించారు. ఇందులో భాగంగా.. ఆసియా, ఐరోపా, అమెరికాలో కొవిడ్‌తో ఆసుపత్రిపాలైన 77,317 మందికి సంబంధించి ప్రచురితమైన డేటాను విశ్లేషించారు.

ఆసుపత్రిలో చేరే సమయానికి వీరిలో 12.89 శాతం మందికి హృద్రోగ సమస్యలు ఉన్నాయని తేల్చారు. 36.08 శాతం మందిలో అధిక రక్తపోటు, 19.45 శాతం మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. ఎక్కువ మందిలో హృదయ స్పందన రేటులో హెచ్చుతగ్గులు ఉన్నట్లు వెల్లడించారు. చాలా మందిలో గుండెలో గాయాన్ని గుర్తించారు. బాధితుల్లో అప్పటికే ఉన్న గుండె సమస్యలు లేదా హృద్రోగ ముప్పునకు దారితీసే అంశాలను బట్టి కొవిడ్‌-19 మరణాలు ఉండొచ్చని తేల్చారు.

ఇదీ చూడండి: టైమ్స్ ‌స్క్వేర్‌లో తొలిసారి ఎగిరిన మువ్వన్నెల జెండా

Last Updated : Aug 16, 2020, 9:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.