మహమ్మారి కరోనా బ్రిటన్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపింది. నెలలోనే లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవడానికి ఈ మహమ్మారి కారణమైంది. ఫలితంగా ఏప్రిలో నెలలో నిరుద్యోగం రేటు 69 శాతం పెరిగిందని ఆ దేశ గణాంకాల విభాగం తెలిపింది.
ఒక్క నెలలో..
మార్చి నెల నాటికి నిరుద్యోగుల సంఖ్య 8,56,000 ఉండగా... ఏప్రిల్ మాసానికి అది 21 లక్షలకు చేరిందని వెల్లడించింది. ఈ లెక్కలు కేవలం లాక్డౌన్ విధించిన తొలివారానివే అని ఆర్థికవేత్త జొనాథన్ తెలిపారు.
"మార్చిలో ఉద్యోగుల సంఖ్య ఎక్కువగానే ఉండేది. అయితే అప్పటి గణాంకాల్లో సెలవుల్లో ఉన్నవారిని కూడా ఉద్యోగిగా లెక్కించాం. కానీ మార్చి చివరిలో పని గంటలు తగ్గిపోయాయి. ఫలితంగా ఉద్యోగాలు కనుమరుగయ్యాయి. ప్రత్యేకంగా ఆస్పత్రులు, నిర్మాణ రంగంలో ఈ విధంగా జరిగింది."
-జొనాథన్ అథో, ఆర్థికవేత్త
ఇదీ చూడండి: భార్య, బిడ్డలను తుపాకీతో కాల్చి వ్యక్తి ఆత్మహత్య