గాలిలో కరోనా వైరస్ తుంపర్ల వ్యాప్తిని లెక్కగట్టే సరికొత్త విధానాన్ని యూరప్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బహిరంగ ప్రదేశాల్లో గాలి తుంపర్ల వ్యాప్తి స్థాయిని కొలిచే సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. గాలిలో సంచరించే ధూళి కణాలనూ.. మాట్లాడేటప్పుడు, దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు వెలువడే తుంపర్లను విభజించి చూడటం చాలా కష్టం. అయితే నెదర్లాండ్స్‌లోని అమ్‌స్టర్‌డాం విశ్వవిద్యాలయ పరిశోధకులు గాలిలో తుంపర్ల స్థాయిని మాత్రమే గుర్తించేలా ప్రత్యేక పరికరాన్ని రూపొందించారు. దీన్ని చేత్తో పట్టుకుని వినియోగించవచ్చు.
ఇదీ చదవండి: 'మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతివ్వండి'
''గాలిలోని ప్రతి తుంపరలోనూ కరోనా వైరస్ మిళితమై ఉండదు. కానీ, మునుపటి పరిశోధనల డేటా ఆధారంగా.. ఒక నిర్దిష్ట ప్రదేశంలో వైరస్ ముప్పు ఎంత ఉందన్నది తెలుసుకోవడానికి మేము అభివృద్ధి చేసిన విధానం ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాలతో పోలిస్తే.. జిమ్‌లు, రైళ్లు, కార్యాలయాల్లో తుంపర్ల సంచారం వందరెట్లు అధికంగా ఉంటుంది. ఇందుకు కారణం.. ఆయా చోట్ల గాలి ప్రసరణ పరిమితంగా ఉండటం'' అని పరిశోధకులు పేర్కొన్నారు. ఆయా ప్రదేశాల్లో తుంపర్ల వ్యాప్తి స్థాయిని తెలుసుకోవడం ద్వారా కొవిడ్ ముప్పును అంచనా వేయవచ్చని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: 'టెస్టుల పరిస్థితే క్లాసికల్ చెస్‌కు ఎదురుకావచ్చు'