ETV Bharat / international

కరోనా కరాళ నృత్యం.. 65 వేలు దాటిన మరణాలు

author img

By

Published : Apr 5, 2020, 6:17 PM IST

కొవిడ్​-19 ధాటికి ప్రపంచదేశాలు కుదేలవుతున్నాయి. పాజిటివ్​ కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది. 65వేలకుపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యం అమెరికా సహా ఐరోపా దేశాల్లో వేగంగా విజృంభిస్తోంది. అమెరికాలో ఇప్పటి వరకు 3.11 లక్షల మందికి వైరస్​ సోకగా 8 వేల మందికిపైగా మరణించారు. స్పెయిన్​లో వరుసగా మూడోరోజు మరణాల సంఖ్యలో తగ్గుదల నమోదైంది.

Corona deaths
ప్రపంచంపై కరోనా కరాళ నృత్యం

కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. నానాటికీ పెరుగుతున్న కేసులు, మరణాలతో భయాందోళనలు తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది. 65వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 2.5 లక్షల మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

అమెరికా విలవిల..

ప్రాణాంతక కరోనా ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. వైరస్​కు కేంద్ర బిందువైన న్యూయార్క్​ నగరం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. అక్కడ మృత్యువు కరాళ నృత్యం చేస్తోంది. ప్రతి రెండు నిమిషాలకు ఒక్కరు చొప్పున మృత్యువాత పడుతున్నారు. అమెరికాలో ఇప్పటికే 8,454 మంది మృతి చెందారు. 3,11,637 మంది వైరస్​ బారిన పడ్డారు.

ఐరోపా దేశాల్లో పరిస్థితి..

ఐరోపా దేశాల్లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్యలో మూడో వంతు ఇక్కడే నమోదు కావటం గమనార్హం. ఇటలీలో ఇప్పటి వరకు అత్యధికంగా 15,362 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్​లో 4,313 మంది మరణించారు.

స్పెయిన్​లో తగ్గిన మరణాలు..

వైరస్​ ధాటికి కుదేలైన స్పెయిన్​లో వరుసగా మూడోరోజు మరణాల సంఖ్యలో తగ్గుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో 674 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 10 రోజుల్లో ఇదే కనిష్టమని ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. స్పెయిన్​లో మొత్తం కేసుల సంఖ్య 1,30,759కి చేరగా.. 12,418 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పరిస్థితి ఇలా..

Corona deaths
వివిధ దేశాల్లో కేసులు

ఇదీ చూడండి: పాక్​కు 'అండర్​వేర్​ మాస్కులు' పంపిన చైనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.