ETV Bharat / international

పదేపదే ఆహార అలవాట్లు మార్చితే అంతే! - ఆహారపు అలవాట్లు

తరచూ ఆహారపు అలవాట్లు మార్చడం వల్ల ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు పరిశోధకులు. పరిమిత ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకున్న తర్వాత రిచ్​ డైట్​కు మారితే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

CHANGING DIET
డైట్
author img

By

Published : Feb 24, 2020, 11:21 AM IST

Updated : Mar 2, 2020, 9:24 AM IST

డైటింగ్​ అని కొన్ని రోజులు కడుపు కట్టుకుని కూర్చుంటాం. కానీ అది ఎంతో కాలం కొనసాగించలేం. ఒక్కసారిగా మళ్లీ భకాసరుడిలా తినడం మొదలుపెడతాం. అయితే... ఆహారపు అలవాట్లపై జాగ్రత్త వహించడం చాలా ముఖ్యమని చెబుతున్నారు పరిశోధకులు. పరిమిత ఆహారం తీసుకొని వెంటనే సమృద్ధికరమైన ఆహారానికి (రిచ్​డైట్​) మారడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు.

పోషకాహారం తీసుకోవడం వల్ల వృద్ధాప్యం నెమ్మదిగా రావడం, వయస్సుతో వచ్చే అనారోగ్య సమస్యల అంశమై చేసే మేలు వంటి అంశాలపై బ్రిటన్​లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు పరిశోధన చేశారు. ఫ్రూట్ ఫ్లైస్ అనే కీటకాలపై వీరి పరిశోధన సాగింది. వీటికి ముందుగా పరిమిత ఆహారాన్ని అందించి... తర్వాత పోషకాహారం(రిచ్ డైట్) ఇచ్చారు.

ముందుగా పరిమిత ఆహారానికి అలవాటు పడ్డ కీటకాలు.. అనంతరం అందించిన పోషకాహారానికి తట్టుకోలేకపోయినట్లు తెలిపారు పరిశోధకులు. ఈ ఆహార మార్పులతో అవి నిత్యం పెట్టే గుడ్ల సంఖ్యలో తగ్గుదల నమోదైందని వివరించారు.

ఇదీ చదవండి: నమస్తే ట్రంప్: భారత్​కు బయల్దేరిన అమెరికా అధ్యక్షుడు

Last Updated : Mar 2, 2020, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.