ETV Bharat / international

భారతీయ రాగానికి నమస్కరించిన ప్రపంచం!

ప్రశాంతమైన సంగీతానికి.. ఆరోగ్యానికి నాంది పలికే యోగా జోడిస్తే ఎలా ఉంటుంది? మనసు, శరీరం ఒకే సారి పులకరించిపోతాయి? రాగా అండ్​ యోగా కార్యక్రమంతో అచ్చంగా అదే చేసి చూపింది ప్యారిస్​లోని కర్ణాటిక్​ కన్జర్​వేటరీ. యావత్​ ప్రపంచానికి కర్ణాటక సంగీతం వినిపించి... సూర్య దేవునికి నమస్కారం చేయించింది. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అవుతోంది.

carnatic-conservatory-of-paris-and-project-raga-and-yoga
భారతీయ రాగానికి.. నమస్కరించిన ప్రపంచం!
author img

By

Published : Jun 21, 2020, 8:34 PM IST

ప్యారిస్​లోని కర్ణాటిక్​ కన్జర్​వేటరీ వారు.. భారత సంస్కృతిని మరోసారి ప్రపంచానికి చాటారు. ఆరు ఖండాలు, 25 దేశాల ప్రజలకు కర్ణాటక సంగీతం రుచి చూపి.. భారతీయ సూర్య నమస్కారాన్ని అలవాటు చేసేందుకు 'రాగా అండ్​ యోగా' కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ అరుదైన ఘట్టాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రపంచ నలుమూలల నుంచి జాతి, లింగ, వయసు తేడాలు లేకుండా.. వివిధ ప్రాంతాలకు చెందిన యోగీలు, యోగినీలు ఈ వీడియో ప్రదర్శించారు.

ఈ రాగా-యోగా వీడియోలో ప్రపంచవ్యాప్తంగా సోదర భావం, ఆరోగ్యం, శాంతి ప్రతిబింబిస్తున్నాయి. వీడియోను ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం సహకారంతో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామన్నారు కర్ణాటిక్​ కన్జర్​వేటరీ అధ్యక్షురాలు ప్రద్యుమ్న. పద్మశ్రీ అవార్డు గ్రహీత, బెంగళూరు స్వామి వివేకానంద యోగా అనుసంధాన వర్సిటి​ ఛాన్సలర్​.. యోగి గురూజీ హెచ్ఆర్ నాగేంద్ర, ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించారని ఆమె పేర్కొన్నారు.

ఇదీ చదవండి:చుట్టూ మంటలు- మధ్యలో ఒంటికాలిపై ఎంపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.