రెండో ప్రపంచం యుద్ధం నాటి ఓ బాంబును తాజాగా పోలాండ్ అధికారులు నీళ్లలో ముంచి పేల్చేశారు. 1945లో నాజీ యుద్ధనౌకపై రాయల్ ఎయిర్‌ఫోర్స్ ఈ బాంబును విసిరిందట. కానీ, అది పేలకుండా కింద పడిపోయింది. స్వినోవిస్యా ప్రాంతంలోని ఓడరేవు వద్ద భూమిలో 12 మీటర్ల లోతులో పాతుకుపోయిన ఐదు టన్నుల బరువున్న బాంబును.. అధికారులు గతేడాది గుర్తించారు. 2.4 టన్నుల పేలుడు పదార్థాలు ఉన్న ఈ బాంబుకు 'టాల్ బాయ్' అని పేరు పెట్టారు.
అందరినీ ఖాళీ..
మంగళవారం ఈ బాంబును 'బాల్టిక్ సీ' సముద్రంలో ముంచి పేలుడు సంభవించకుండా నిర్వీర్యం చేసేందుకు నేవీ అధికారులు ప్రయత్నించారు. కానీ, ఆకస్మాత్తుగా పేలుడు సంభవించిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఆపరేషన్ చేపట్టకముందే స్థానిక ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి బాంబు నిర్వీర్యం చేసే ప్రాంతానికి.. రెండున్నర కిలోమీటర్ల దూరంలో సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. బాంబు పేల్చే క్రమంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. బాంబు పేలుడు ధాటికి నీరు పెద్దఎత్తున ఎగసిపడింది.
ఇదీ చూడండి:ఆ దేశాల్లో మళ్లీ కరోనా ఉద్ధృతి- భయాందోళనలో ప్రజలు