కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. టీవీ, ఇంటర్నెట్తో కాలక్షేపం చేస్తున్నారు. కానీ... బ్రిటన్‌కు చెందిన ప్రముఖ క్రీడాకారుడు తన 32వ పుట్టినరోజున ఇంటి ఆవరణలోని గార్డెన్‌లోనే మారథాన్ పూర్తి చేశాడు.
జావెలిన్ త్రో మాజీ ఆటగాడైన జేమ్స్ క్యాంప్‌బెల్ చెల్టెన్హమ్లోని తన ఇంటి పెరటిలో దాదాపు 7 వేల సార్లు తిరిగి మొత్తం 42.2 కిలోమీటర్లు పరుగెత్తాడు. ఐదు గంటల పాటు సాగిన ఈ మారథాన్‌ను సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. దానితో పాటు ఓ వెబ్సైట్ లింక్ ఇచ్చి... కరోనాపై పోరు కోసం విరాళాలు ఇవ్వాలని కోరాడు.
జేమ్స్ మారథాన్ ముగిసే సమయానికి 18 వేల పౌండ్లు వచ్చాయి. ఈ మొత్తాన్ని బ్రిటన్ జాతీయ ఆరోగ్య సంస్థకు అందజేశాడు.
ఇదీ చదవండి: ఆ సొరంగంలో నడిస్తే కరోనా వైరస్ హతం!