జలియన్‌వాలా బాగ్ హత్యాకాండ నేపథ్యంలో బ్రిటీష్ ఇండియన్ జర్నలిస్ట్, రచయిత్రి అనితా ఆనంద్ రాసిన పుస్తకం యూకేలోని అత్యున్నత పురస్కారాన్ని దక్కించుకుంది. 1919లో జరిగిన ఈ దారుణ ఘటనలో చిక్కుకున్న ఓ యువకుడి కథతో రాసిన 'ద పేషెంట్ అసాసిన్: ఏ ట్రూ టేల్ ఆఫ్ మాసెకర్, రివెంజ్ అండ్ ద రాజ్' పుస్తకానికి 'పెన్-హెసెల్ టిల్ట్‌మన్ ప్రైజ్ ఫర్ హిస్టరీ-2020' పురస్కారం వరించింది. ఈ అవార్డు కోసం పోటీ పడ్డ మరో ఆరు పుస్తకాలను దాటుకొని పురస్కారం గెలుచుకుంది.
అనితా ఆనంద్ రాసిన పుస్తకాన్ని 'వాస్తవ చారిత్రక మహాకావ్యం'గా అభివర్ణించారు న్యాయనిర్ణేతలు. వచ్చే దశాబ్దాల పాటు ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చని పేర్కొన్నారు. చారిత్రక దృఢత్వంతో పాటు పరిశోధాత్మక పుస్తకానికి ఈ ఏడాది పురస్కారం ఇవ్వాలని అనుకున్నట్లు తెలిపారు. అనితా రాసిన పుస్తకానికి ఈ లక్షణాలన్నీ ఉన్నాయని చెప్పారు.
రాజకీయ జర్నలిస్ట్ అయిన అనితా ఆనంద్.. 20 ఏళ్ల పాటు బీబీసీలో పనిచేశారు. ప్రతిష్టాత్మక అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు.
-
I am so honoured by this award. Thank you so much. https://t.co/FdxfCFqMga
— anita anand (@tweeter_anita) December 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I am so honoured by this award. Thank you so much. https://t.co/FdxfCFqMga
— anita anand (@tweeter_anita) December 1, 2020I am so honoured by this award. Thank you so much. https://t.co/FdxfCFqMga
— anita anand (@tweeter_anita) December 1, 2020
చారిత్రక ఘటనలపై వెలువడిన పుస్తకాలకు ఏటా ఈ అవార్డులు ఇస్తారు. విజేతకు రెండు వేల పౌండ్ల నగదు బహుమతి అందిస్తారు.