గడువు ముగుస్తున్నప్పటికీ బ్రెగ్జిట్ ఒప్పందంపై సంక్షోభం ఇప్పట్లో తేలేలా లేదు. ఒప్పందాన్ని గట్టెక్కించడానికి బ్రిటన్ ప్రధాని థెరెసా మే తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ ఒప్పందాన్ని ఇప్పటికే రెండు సార్లు చట్టసభ్యులు తిరస్కరించారు. మూడోసారి ఓటింగ్‌కు ప్రధాని ప్రయత్నిస్తున్నారు.
ఈ విషయమై తాజాగా బ్రిటన్ పార్లమెంట్ స్పీకర్ స్పందించారు. బిల్లులో తగిన మార్పులు చేయకుండా మూడోసారి ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తే ఓటింగ్ నిర్వహించడానికి అవకాశమివ్వనని తెలిపారు.
జనవరిలో 230 ఓట్ల తేడతో బిల్లు తొలిసారి ఓడింది. గత వారం జరిగిన రెండో ఓటింగ్‌లోనూ 149 ఓట్ల తేడా వల్ల బిల్లు గట్టెక్కలేదు.
పార్లమెంట్ నిబంధనల ప్రకారం ఓకే అంశంపై చట్ట సభ్యులు రెండు సార్లు ఓటింగ్ జరపకూడదు.