ETV Bharat / international

ఇరాన్​తో ఉద్రిక్తతలు కోరుకోవడం లేదు: బ్రిటన్​ - బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి జెరెమీ హంట్

ఇరాన్​తో నెలకొన్న ఉద్రిక్తతలను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నామని, దౌత్యపరమైన పరిష్కారం కోసమే ప్రయత్నిస్తున్నట్టు బ్రిటన్​ విదేశాంగ మంత్రి జెరెమీ హంట్ పేర్కొన్నారు. తమ దేశ నౌకలను విడిచిపెట్టాలని, నౌకమార్గ స్వేచ్ఛ కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇరాన్​తో ఉద్రిక్తతలు కోరుకోవడం లేదు: బ్రిటన్​
author img

By

Published : Jul 21, 2019, 8:18 AM IST

ఇరాన్​తో తాము వివాదం కోరుకోవడం లేదని, దౌత్యపరమైన పరిష్కారం కోసమే ప్రయత్నిస్తున్నామని బ్రిటన్ విదేశాంగ మంత్రి జెరెమీ హంట్ ఉద్ఘాటించారు. గల్ఫ్ ​తీరంలో తమ దేశ నౌకలను ఇరాన్ నిర్బంధించడంపై యూకే అత్యవసర కమిటీ సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఒమానీ జలాల్లో మా దేశానికి చెందిన చమురు నౌకను ఇరాన్ అదుపులోకి తీసుకుంది. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు."-జెరెమీ హంట్​, బ్రిటన్ విదేశాంగ మంత్రి

ప్రతీకారం కోసమే..

ఈ నెల మొదట్లో 'గ్రేస్​ 1' అనే ఇరానీ సూపర్ ట్యాంకర్​ను బ్రిటన్ స్వాధీనం చేసుకుంది. తమ నౌక విషయంలో జరిగిన దానికి ప్రతీకారంగానే బ్రిటీష్​ నౌకను స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలు గురించి తమకు బాగా తెలుసని ఇరాన్ గార్డియన్​ కౌన్సిల్​ అధికార ప్రతినిధి అబ్బాస్​ అలీ తెలిపారు.

స్వేచ్ఛను కాపాడండి

తమ నౌకలను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఇరాన్ ప్రమాదకరంగా వ్యవహరిస్తోందని జెరెమీ హంట్ అన్నారు. ఇరాన్ నిర్బంధంలో ఉన్న నౌక, అందులోని 23 మంది సిబ్బంది భద్రతపై హంట్​ ఆందోళన వ్యక్తం చేశారు. నౌకామార్గ స్వేచ్ఛను ఇరాన్ తప్పనిసరిగా కొనసాగించాలని కోరారు. తాము సైనిక చర్యల గురించి ఆలోచించడం లేదని.. దౌత్యపరమైన పరిష్కారం కోసమే ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

ఈ విషయంలో బ్రిటన్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై సోమవారం పార్లమెంటుకు వివరిస్తామని హంట్​ తెలిపారు.

ఇదీ చూడండి: అమెరికా పర్యటనలో... పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Sunday, 21 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2146: US Top Gun Connelly AP Clients Only 4221364
Jennifer Connelly says ‘Top Gun: Maverick’ co-star Tom Cruise is ‘extra everything’
AP-APTN-1651: OBIT Cesar Pelli AP Clients Only 4221345
Famed architect Cesar Pelli dies at 92
AP-APTN-1616: US Carnival Row Content has significant restrictions, see script for details 4221311
Orlando Bloom's new series tackles real-world issues in a Victorian fantasy setting
AP-APTN-1256: ARCHIVE Trump ASAP Rocky AP Clients Only 4221327
Swedish PM to Trump: A$AP Rocky won't get special treatment
AP-APTN-1053: US Taron Egerton AP Clients Only 4221315
Taron Egerton calls 'Lion King' 'transcendent,' addresses rumors he's set to take Wolverine's claws over from friend Hugh Jackman
AP-APTN-1052: US Dark Crystal Content has significant restrictions, see script for details 4221314
Taron Egerton's 'whiny' first take on his character in Netflix's 'Dark Crystal' series
AP-APTN-0938: ARCHIVE Simon Yam AP Clients Only 4221305
Veteran Hong Kong actor Simon Yam stabbed at event in China
AP-APTN-0234: US Otherhood Huffman Content has significant restrictions, see script for details 4221288
Co-stars Angela Bassett and Patricia Arquette reflect on their 'Otherhood' co-star Felicity Huffman's legal troubles
AP-APTN-0201: US Cats Reaction Content has significant restrictions, see script for details 4221290
Comic-Con stars react to ‘Cats’ trailer: ‘Uncomfortable,’ ‘absurd’ but movie a must-see
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.