సియరా తుపాను ప్రభావంతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం బ్రిటన్, ఐర్లాండ్లను కుదిపేసింది. తుపాను కారణంగా ఉత్తర ఐరోపాలో విద్యుత్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తీవ్ర వాతావరణ ప్రభావంతో ఫ్రాన్స్ బెల్జియం, నెదర్లాండ్స్ ,స్విట్జర్లాండ్, జర్మనీ దేశాల్లో పలు విమాన సర్వీసులు రద్దు చేశారు. బ్రిటన్‌లో దాదాపు 30 వేల ఇళ్లు అంధకారంలో ఉన్నాయి.
150 కిలోమీటర్లు వేగంతో...
వాయువ్య వేల్స్ లిలిన్ ద్వీపకల్పంలోని అబెర్డాన్ వద్ద 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 24 గంటల్లో వాయువ్య ఇంగ్లాండ్‌లో లేక్ జిల్లా నేషనల్ పార్క్ వద్ద 150 మిల్లిమీటర్లు వర్షపాతం నమోదయిందని అధికారులు తెలిపారు.
ముగ్గురుకి గాయాలు...
పెర్త్, మధ్య స్కాట్‌ల్యాండ్‌లో పబ్ పైకప్పు విరిగిపడటం వల్ల ముగ్గురుకి గాయాలయ్యాయి. వివిధ క్రీడా కార్యక్రమాలు రద్దు చేశారు. మహిళల ఫుట్‌బాల్ సూపర్ లీగ్, 10 కే రన్ వంటి వాటిని రద్దు చేశారు.
పలు విమానాలు రద్దు!
జర్మనీ, ఫ్రాంక్‌ఫర్ట్, బెర్లిన్, మ్యూనిచ్, కొలోన్, హనోవర్‌లలో అనేక విమాన సేవలను రద్దు చేసినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. డ్యూసెల్డార్ఫ్‌లో 111 విమాన సర్వీసులను ఆదివారం రద్దు చేశారు.
స్తంభించిన రవాణా వ్యవస్థ!
జర్మనీ రైలు ఆపరేటర్ డ్యూయిష్ బాన్, అనేక ప్రాంతాల్లో రైలు సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ స్తంభించినట్లు తెలిపారు. ఐరోపాలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం ఆమ్స్టర్డామ్ షిపోల్ నుంచి 120 విమాన సేవలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: బ్రిటన్ వీసా, ఇమిగ్రేషన్ విధివిధానాలు ఖరారు