వచ్చే వారం పార్లమెంట్లో బ్రెగ్జిట్ ఒప్పందాన్ని మూడోసారి ప్రతిపాదించనున్నారు మే. ఈసారి బిల్లు ఆమోదం పొందితే ఒప్పందం ప్రకారం మే 22న ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ అధికారికంగా వైదొలుగుతుంది.
ఒకవేళ బిల్లు ఆమోదం పొందకపోతే ఏప్రిల్ 12లోపు మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని కనిపెట్టాలి. లేకపోతే ఒప్పందం లేకుండానే ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలగాలి. గడువు పొడిగింపునకు మరోమారు అభ్యర్థించే అవకాశమూ లేకపోలేదు.