ETV Bharat / international

బ్రెజిల్​లో 5 మిలియన్లు దాటిన కరోనా కేసులు - కరోనా తాజా వార్తలు

ఐరోపా, ఆసియా దేశాలపై కొవిడ్​ ప్రభావం అధికంగా ఉంది. ఇటలీ, ఫ్రాన్స్​లో మళ్లీ కేసులు పెరిగిపోతున్నాయి. బ్రెజిల్​లో మొత్తం కేసుల సంఖ్య 50 లక్షలు దాటింది. అమెరికాలో కొత్తగా 48 వేలకుపైగా కేసులు.. 932 మరణాలు సంభవించాయి.

Slug Brazil's COVID-19 cases top 5 million
బ్రెజిల్​లో 5 మిలియన్లు దాటిన కరోనా కేసులు
author img

By

Published : Oct 8, 2020, 8:52 AM IST

ప్రపంచదేశాల్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల 64 లక్షలకు చేరువైంది. 10 లక్షల 60 వేలమందికిపైగా మరణించారు.

అమెరికాలో ఒక్కరోజే 48 వేల 715 మందికి వైరస్​ సోకింది. మొత్తం కేసులు 77 లక్షల 76 వేలు దాటాయి. మరో 932 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 2 లక్షల 16 వేలు దాటింది.

మెక్సికోలో కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. 4,828 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 471 మంది కొవిడ్​కు బలయ్యారు.

బ్రెజిల్​లో వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. మొత్తం కేసులు 50 లక్షల మార్కును అధిగమించాయి. బుధవారం 31 వేల కొత్త కేసులు.. 733 మరణాలు సంభవించాయి.

  • ఫ్రాన్స్​పై కరోనా మళ్లీ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కొత్తగా 18 వేలకుపైగా కేసులను గుర్తించారు.
  • అర్జెంటీనా, బ్రిటన్​ సహా ఆసియా దేశాల్లోనూ వైరస్​ తీవ్రత అధికంగా ఉంది.
  • మెక్సికో, ఇరాన్​లో 4వేలకుపైగా, ఇటలీ, ఇరాక్​లో 3 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి.
  • ఇండోనేసియా, ఇజ్రాయెల్​, నెదర్లాండ్స్​లో సగటున 5 వేల కేసులు నమోదవుతున్నాయి.

వైరస్​ విజృంభణ దృష్ట్యా పలు దేశాలు మళ్లీ కఠిన ఆంక్షలు విధించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.