ETV Bharat / international

యంగ్​గా కనిపించాలని ప్లాస్టిక్ సర్జరీ- కళ్లు మూయలేకపోతున్న వృద్ధుడు! - plastic surgery closing eyes

Botched Surgery eye failure: 79 ఏళ్ల వయసులోనూ యువకుడిలా కనిపించాలన్న ఓ వృద్ధుడి ఆశ.. అసాధారణ సమస్యను తెచ్చిపెట్టింది. 'అందం' కోసం చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ.. అతడు ఎప్పటికీ కనురెప్పలు మూయలేని విధంగా మార్చింది. రాత్రిళ్లు కళ్లకు టేప్​ అంటించుకుని నిద్రపోవాల్సిన దుస్థితికి దారితీసింది.

Botched Surgery failure
Botched Surgery failure
author img

By

Published : Jan 24, 2022, 12:11 PM IST

Botched Surgery eye failure: ప్లాస్టిక్​ సర్జరీ వికటించి ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నాడు ఓ వృద్ధుడు. కనురెప్పలు మూయలేక.. నేత్ర సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నాడు. నిత్యం ప్రత్యక్ష నరకం చూస్తున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఏం జరిగింది?

Cosmetic surgery fail: పీట్​ బ్రాడ్​హర్​స్ట్​.. ఇంగ్లాండ్​లోని బర్మింగ్​హమ్​ వాసి. వయసు 79 ఏళ్లు. పెళ్లయి.. ఇద్దరు పిల్లలున్నారు. కొన్నేళ్ల క్రితం పళ్లకు సంబంధించి ఓ శస్త్రచికిత్స చేయించుకున్నాడు పీట్. అయితే.. ఆ సర్జరీ వల్ల అతడి బుగ్గల రూపం మారిపోయింది. చూడడానికి కాస్త ఇబ్బందికరంగా తయారయ్యాడు అతడు. "నువ్వు అందంగా లేవు" అంటూ పీట్​ భార్య అతడ్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. అతడు చాలా బాధపడ్డాడు. ఎలాగైనా అందంగా, యువకుడిలా కనిపించాలని అనుకున్నాడు.

2019లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని అనుకున్నాడు పీట్. బుగ్గల రూపం మార్చుకుని, కళ్ల కింద క్యారీ బ్యాగులు, ముఖంపై ముడతలు పోయేలా.. నెక్ లిఫ్ట్, అండర్​ ఐ బ్లెఫారోప్లాస్టీ, రైనోప్లాస్టీ వంటి రకరకాల చికిత్సలకు సిద్ధమయ్యాడు. వీటన్నింటికీ బర్మింగ్​హమ్​లోని బీఎంఐ ఆస్పత్రి వేదికైంది. వైద్యులు ఏకధాటిన 9 గంటలపాటు సర్జరీ చేశారు. పీట్​కు 11 వేల పౌండ్లు( సుమారు రూ.11 లక్షలు) బిల్ వేశారు.

plastic surgery unable to close eyes

ఇంటికెళ్లాక చూస్తే...

సర్జరీ అయిన వెంటనే పీట్​కు ఏదో తేడాగా, ముఖంపై ఎవరో తీవ్రంగా కొట్టినట్టు అనిపించింది. కళ్లు మూయలేకపోతున్నానన్న భావన కలిగింది. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. అలానే డిశ్ఛార్జ్ అయి ఇంటికి వెళ్లాడు పీట్. కుట్లు తీయించుకునేందుకు రెండు వారాల తర్వాత ఆస్పత్రికి వెళ్లాడు. కళ్లలో మంటగా ఉందని, తరచూ నీరు కారుతోందని వైద్యులకు చెప్పాడు. వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. సైడ్​ ఎఫెక్ట్స్ సహజమేనని, నెమ్మదిగా సెట్ అయిపోతుందని చెప్పారు.

కొద్దిరోజుల తర్వాత ఇతర ఆరోగ్య సమస్యలతో పీట్​ మరో ఆస్పత్రికి వెళ్లాడు. పరిశీలించిన వైద్యులు.. అతడి కనురెప్పలు సరిగా మూసుకోవడం లేదని గుర్తించారు. వెంటనే ప్లాస్టిక్ సర్జరీ చేసిన ఆస్పత్రికి వెళ్లాడు పీట్. అక్కడి వైద్యులు సమస్య ఉందని అప్పుడు అంగీకరించారు. బుగ్గలు, కనురెప్పలు కలిసే చోట చర్మంలో ఇబ్బంది ఉందని.. సరిచేసేందుకు ఈసారి 'ఉచితంగా' మరో సర్జరీ చేసి పెడతామన్నారు. పీట్ ఒప్పుకున్నాడు. కొత్త సర్జరీ పూర్తయ్యేందుకు నాలుగు గంటలు పట్టింది. కానీ.. సమస్య మరింత తీవ్రమైంది.

అలా చేస్తేనే నిద్ర..

'ఫ్రీ' సర్జరీ తర్వాత పీట్​ కళ్లు అసలు మూతపడడం లేదు. కళ్లలో మంట మొదలైంది. దృష్టి లోపం వచ్చింది. ముందు ఏముందో సరిగా కనిపించక.. కారు నడపలేడు. ఎదుటివారి ముఖకవళికలను గుర్తించలేడు. తన రూపం గురించి వినపడే కామెంట్ల సంగతి సరేసరి. కళ్ల మంట తగ్గించుకునేందుకు రోజుకు 8సార్లు ఐడ్రాప్స్ వేసుకోవడం తప్పనిసరి. నిద్రపోవాలంటే చిన్నపాటి టవల్​ను కళ్ల చుట్టూ చుట్టుకోవాలి. లేదంటే టేప్ అతికించుకోవాలి. దాదాపు రెండేళ్ల నుంచి ఇలానే ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నాడు పీట్.

ఇంగ్లాండ్ వైద్యులు నో చెప్పారని టర్కీకి..

పీట్​కు మరోమారు సర్జరీ చేసేందుకు యూకేలోని ఏ ఒక్క ఆస్పత్రి కూడా ఒప్పుకోలేదు. ఇంకేమైనా చేస్తే అతడు పూర్తిగా కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందన్నది అక్కడి వైద్యుల భయం. కానీ పీట్​ మాత్రం వదిలిపెట్టలేదు. ఈసారి టర్కీ వెళ్లాడు. అక్కడ సర్జరీ చేయించుకున్నాడు. సమస్య కాస్త తగ్గినా.. ఎడమ కంటిని ఇప్పటికీ పూర్తిగా మూయలేకపోతున్నాడు ఆ వృద్ధుడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: ఇంట్లో మృతదేహం.. చుట్టూ 125 పాములు.. ఏమై ఉంటుంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.