ETV Bharat / international

30ఏళ్ల తర్వాత బ్రిటన్​ అతిపెద్ద రక్షణ బడ్జెట్​

రక్షణ రంగ బడ్జెట్​ను భారీగా పెంచేందుకు బ్రిటన్ సిద్ధమైంది. ఈ మేరకు ప్రధాని బోరిస్​ జాన్సన్​ కీలక బిల్లును గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. రక్షణ రంగంలో ఏటా అదనంగా 400 కోట్ల పౌండ్లను అందించాలని నిర్ణయించారు. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత ఇదే అత్యధికం.

UK-PM-DEFENCE-SPENDING
రక్షణ బడ్జెట్​
author img

By

Published : Nov 19, 2020, 5:28 PM IST

ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినప్పటి నుంచి రక్షణ రంగంలో అతిపెద్ద పెట్టుబడుల కార్యక్రమాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్​ రూపొందించారు. ఈ ప్రణాళికను పార్లమెంటులో గురువారం ప్రవేశపెట్టనున్నారు.

తాజా ప్రణాళిక ప్రకారం.. రాబోయే నాలుగేళ్ళలో ఏటా అదనంగా 400 కోట్ల పౌండ్ల చొప్పున రక్షణ రంగంలో ఖర్చు చేయనున్నారు. అంతరిక్షం, సైబర్ రక్షణ ప్రాజెక్టులు కూడా ఇందులో భాగంగా ఉంటాయి. ఫలితంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ప్రధాని కార్యాలయం తెలిపింది.

కృత్రిమ మేధ కోసం ప్రత్యేక సంస్థ, జాతీయ సైబర్ దళం ఏర్పాటు, కొత్తగా స్పేస్ కమాండ్​, 2022లో తొలి రాకెట్​ ప్రయోగం.. లక్ష్యంగా ఈ పెట్టుబడులపై దృష్టి సారించారు. అంతర్జాతీయ సమస్యలను ఎదుర్కోవటం, పలుకుబడిని పెంచుకునే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది జాన్సన్​ ప్రభుత్వం.

ఇదీ చూడండి: వృద్ధుల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచుతున్న ఆక్స్​ఫర్డ్​ టీకా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.