బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలకు 2 రోజుల ముందు ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇంటర్వ్యూ చేస్తున్న ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ ఫోన్ లాక్కొని కసురుకుంటూ జేబులో వేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారగా... బోరిస్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ జరిగింది
డిసెంబర్ 12న సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ పనితీరుపై బోరిస్‌ను ఇంటర్వ్యూ చేశారు ఐటీవీ రిపోర్టర్ జో పైక్. ఓ ఆస్పత్రిలో నాలుగేళ్ల బాలుడు నేలపై పరిచిన వస్త్రాలపైనే పడుకుని చికిత్స తీసుకుంటున్న ఫొటోను ప్రధానికి చూపించారు. అసహనానికి గురైన జాన్సన్... టక్కున ఆ ఫోన్ లాక్కుని, జేబులో పెట్టుకున్నారు.
ఇలా చేయడంపై పైక్ అభ్యంతరం తెలిపారు. కాసేపటికి ఫోన్ తీసి, బాలుడు ఫొటో చూసిన ప్రధాని... బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఫోన్‌ను రిపోర్టర్‌కు తిరిగిచ్చారు.
ఇందుకు సంబంధించిన దృశ్యాల్ని ఆ రిపోర్టర్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. కాసేపట్లోనే ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది. రెండు గంటల్లోనే దాదాపు పది లక్షల మందికిపైగా వీక్షించారు. ప్రధాని తీరును తప్పుబడుతూ విమర్శలు గుప్పించారు.
-
Tried to show @BorisJohnson the picture of Jack Williment-Barr. The 4-year-old with suspected pneumonia forced to lie on a pile of coats on the floor of a Leeds hospital.
— Joe Pike (@joepike) December 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
The PM grabbed my phone and put it in his pocket: @itvcalendar | #GE19 pic.twitter.com/hv9mk4xrNJ
">Tried to show @BorisJohnson the picture of Jack Williment-Barr. The 4-year-old with suspected pneumonia forced to lie on a pile of coats on the floor of a Leeds hospital.
— Joe Pike (@joepike) December 9, 2019
The PM grabbed my phone and put it in his pocket: @itvcalendar | #GE19 pic.twitter.com/hv9mk4xrNJTried to show @BorisJohnson the picture of Jack Williment-Barr. The 4-year-old with suspected pneumonia forced to lie on a pile of coats on the floor of a Leeds hospital.
— Joe Pike (@joepike) December 9, 2019
The PM grabbed my phone and put it in his pocket: @itvcalendar | #GE19 pic.twitter.com/hv9mk4xrNJ
ప్రత్యర్థులకు అస్త్రం...
బోరిస్‌పై ప్రత్యర్థి లేబర్ పార్టీ జెరెమీ కార్బిన్ విమర్శలు కురిపించారు. ప్రజారోగ్యాన్ని ఆయన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఇదీ చూడండి : ఎన్నికల వేళ ప్రధాని ప్రియురాలు చీరలో మెరిసెనిలా...