ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రణాళికలు రచిస్తున్నారు. బ్రెగ్జిట్‌కు ఆఖరి తేదీ అయిన అక్టోబర్ 31 లోపు ఎలాగైనా ఈయూ నుంచి తప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం మరో అడుగు ముందుకేశారు. అక్టోబర్ 14 వరకు హౌస్ ఆఫ్ కమన్స్ను రద్దు చేయాలని క్వీన్ ఎలిజబెత్ II ను కోరారు.
ఎందుకు..?
అక్టోబర్ 14 వరకు పార్లమెంటు రద్దు ద్వారా ఎంపీలు ఎటుంవంటి ముఖ్యమైన చట్టాలను చర్చించేందుకు అవకాశం ఉండదు. బ్రెగ్జిట్‌పై ప్రతిపక్షం ఎలాంటి అడ్డుకట్ట వేయకుండా ఈ నిర్ణయం ఉపకరించే అవకాశం ఉంది.
ఈయూ నుంచి వైదొలిగాక బ్రిటన్ పయనంపై కొత్త ప్రధాని నేతృత్వంలోని సర్కారు నిర్ణయం తీసుకునేందుకు ఇది సరైన సమయమని ప్రభుత్వ వర్గాల సమాచారం.
- ఇదీ చూడండి: ప్రమాద ఘంటికలు మోగిస్తున్న అమెజాన్ కార్చిచ్చు