ETV Bharat / international

' ముందస్తుకు ఒప్పుకుంటేనే బ్రెగ్జిట్ గడువు పెంచుతా' - బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. ఎంపీల ముందు ఓ ప్రతిపాదన ఉంచారు. బ్రెగ్జిట్​పై చర్చించడానికి గడువు పెంచుదామని, అయితే డిసెంబర్​ 12న సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడానికి అంగీకరిస్తేనే అది సాధ్యమని ఆయన తేల్చిచెప్పారు.

' ముందస్తు ఎన్నికలకు ఒప్పుకుంటేనే..బ్రెగ్జిట్ గడువు పెంచుతా'
author img

By

Published : Oct 25, 2019, 6:13 AM IST

బ్రెగ్జిట్​ విషయంలో ఎదురుదెబ్బతిన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్​.. ఎంపీల ముందు ఓ ప్రతిపాదన ఉంచారు. బ్రెగ్జిట్​ బిల్లుపై చర్చించడానికి మరింత గడువు పెంచడానికి తాను సిద్ధమేనని, అయితే డిసెంబర్​ 12న సార్వత్రిక ఎన్నికలు జరపడానికి అంగీకరిస్తేనే అది సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

ఐరోపా సమాఖ్య​ (ఈయూ) బ్రెగ్జిట్​ గడువును అక్టోబర్​ 31 నుంచి ఇంకా పెంచుతుందా? లేదా? అన్నది నేడు తేలనుంది. ఈ నేపథ్యంలో 10 డౌనింగ్​ స్ట్రీట్​లో అత్యవసర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం బోరిస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

"బ్రెగ్జిట్ ఒప్పందం​పై పార్లమెంట్​లో సహేతుకమైన చర్చ జరగడానికి నిజంగా మరింత సమయం కావాలనుకుంటే, అలాగే చేద్దాం. కానీ ఎంపీలు డిసెంబర్​ 12న సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు అంగీకరించాలి. అప్పుడు ప్రజలే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తారు. "

- బోరిస్ జాన్సన్​, బ్రిటన్ ప్రధాని

'బోరిస్ బ్రెగ్జిట్​'

బోరిస్ గతవారం ఈయూతో బ్రెగ్జిట్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇందులో వివాదాస్పదమైన ఐర్లాండ్​ సరిహద్దు నిబంధనను పక్కనపెట్టారు. దీనికి ఎంపీల మద్దతు ఉంటుందని ఆయన భావించారు.

ఈయూ నిర్ణయంపై ఉత్కంఠ

ఇప్పుడు బ్రెగ్జిట్ గడువును ఈయూ పొడిగిస్తుందా? లేదా? అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నవంబర్​ వరకు బ్రెగ్జిట్ గడువును పొడిగిస్తే, జాన్సన్ తన వైఖరిని నెగ్గించుకునేందుకు పార్లమెంట్​లో మరో ప్రయత్నం చేయవచ్చు. 2020 జనవరి వరకు పొడిగించాలని నిర్ణయిస్తే మాత్రం సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంకావాలని ఎంపీలను హెచ్చరిస్తున్నారు బోరిస్ .

లేబర్​పార్టీలోనూ

బోరిస్ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా? వచ్చే ఏడాది వరకు ఆగాలా? అనే విషయంలో ప్రతిపక్ష లేబర్​ పార్టీలోనూ రెండు వర్గాలు ఏర్పడ్డాయి.

అందుకు ఓకే..

బోరిస్ బ్రెగ్జిట్​ను వ్యతిరేకిస్తున్న ఎంపీలు.. వార్షిక శాసనసభ కార్యక్రమానికి మాత్రం అంగీకారం తెలిపారు.

ఇదీ చూడండి: కశ్మీర్​: ట్రక్కు డ్రైవర్లపై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
KISSIMMEE POLICE DEPARTMENT– AP CLIENTS ONLY
Kissimmee, Florida – 19 October 2019
++VERTICAL VIDEO++
++BLUR ADDED AT SOURCE++
1. Mother handing baby to police officers, officers performing CPR on the baby, mother crying, police officers pulling out resuscitation equipment, EMS arriving, baby put on stretcher
STORYLINE:
A Florida police officer was in the right place when an 18-month-old boy began choking on a Goldfish cracker.
Footage from the Kissimmee police officer's body camera showed Amanda Zimmerman handing him the boy's lifeless body on Saturday.
Zimmerman tells WESH that she "was just beside herself" when the boy started choking.
More officers arrived. As one officer helped calm Zimmerman the others began performing CPR on little MJ until he let out a gasp.
The Kissimmee Fire Department arrived and took the child to a hospital where police said "he was crying and well."
Zimmerman says MJ is doing fine and she is thankful for the officers who helped save him.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.