ETV Bharat / international

అమెరికా​- రష్యా విదేశాంగ మంత్రుల తొలి భేటీ - రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్​

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్​.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్​తో బుధవారం తొలిసారిగా భేటీ కానున్నారు. ఈ భేటీలో ఇరు దేశాల సత్సంబంధాలతో పాటు అంతర్జాతీయ ఎజెండాపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

US Russia meeting, అమెరికా రష్యా చర్చలు
రష్యా విదేశాంగ మంత్రితో బ్లింకన్ భేటీ
author img

By

Published : May 19, 2021, 12:49 PM IST

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్​.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్​తో బుధవారం తొలిసారిగా భేటీ కానున్నారు. ఐస్​లాండ్​లో జరుతున్న ఆర్కిటిక్​ కౌన్సిల్​ మినిస్టెరియల్​ మీటింగ్​ సందర్భంగా ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ.. రష్యాతో సత్సంబంధాలు నెలకొల్పేందుకు అవకాశంగా భావిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. రష్యాతో అమెరికా సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో బ్లింకన్​ - లవ్రోవ్​ల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ భేటీలో సత్సంబంధాలతో పాటు అంతర్జాతీయ ఎజెండాపై ఇరు దేశాలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్​, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ల భేటీపై కూడా మంత్రులు చర్చించే అవకాశం ఉందని సమాచారం.

రష్యా అధ్యక్షుడితో ఇతర దేశాల్లో జరిగే సదస్సు సందర్భంగా భేటీ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని అధ్యక్షుడు బైడెన్ ఇటీవల పేర్కొన్నారు. అయితే బైడెన్​ ఆహ్వానాన్ని పుతిన్​ స్వాగతిస్తారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.

ఇదీ చదవండి : 'భారత్ వేరియంట్​పై అమెరికా టీకాలు భేష్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.