ETV Bharat / international

ఐరోపాలో 'ఫ్లాయిడ్' నిరసనల సెగ

అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్​ ఫ్లాయిడ్.. పోలీసు అతి ప్రవర్తన కారణంగా మృతి చెందడంపై బ్రిటన్ రాజధాని లండన్​లో నిరసనలు జరిగాయి. మృతుడికి న్యాయం జరగాలంటూ ప్రజలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఫ్రాన్స్​లోనూ జాత్యహంకారానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి.

london
ఐరోపాలో ఫ్లాయిడ్ నిరసనల సెగ
author img

By

Published : Jun 14, 2020, 9:08 AM IST

ఆఫ్రికన్ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ ప్రాంతంలో వందలాది మంది నిరసనకారులు ప్రదర్శనలు చేశారు. ఆందోళనకారులను అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టేసి నిరసన తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో జాత్యహంకారం నశించాలని శాంతియుత ప్రదర్శనలు నిర్వహించారు.

అయితే హింసాత్మక ఘర్షణలను నివారించడానికి.. బ్రిటన్‌ పోలీసులు ముందస్తుగా కఠిన ఆంక్షలు విధించారు. పెద్ద మొత్తంలో నిరసనలు జరుగుతాయని గుర్తించిన పోలీసులు.. ముందు జాగ్రత్త చర్యగా వంద మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేశారు.

ఐరోపాలో ఫ్లాయిడ్ నిరసనల సెగ

ఫ్రాన్స్​లోనూ నిరసనలు..

ఫ్రాన్స్ రాజధాని పారిస్​లోనూ జాత్యహంకారానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. పటాసులు పేల్చి నిరసనలు తెలిపారు ఆందోళనకారులు. నిరసనకారులు లక్ష్యంగా బాష్పవాయువును ప్రయోగించారు పోలీసులు. ఒపేరా హౌస్​ వైపు వెళుతున్న ఆందోళనకారులను అడ్డుకున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలను చెదరగొట్టారు.

ఇదీ చూడండి: ఓడిపోతే ప్రశాంతంగా వైదొలుగుతా: ట్రంప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.