కొవాగ్జిన్‌కు అత్యవసర అనుమతులు (Covaxin WHO approval) ఇచ్చే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సాంకేతిక సలహా సంఘం సమీక్ష నిర్వహించింది. సలహా సంఘం సంతృప్తి చెందితే 24 గంటల్లో అత్యవసర వినియోగానికి అనుమతి (Covaxin WHO approval) లభించనుంది. ఈమేరకు డబ్ల్యూహెచ్‌ఓ అధికార ప్రతినిధి మార్గరెట్ హారిస్ వెల్లడించారు.
ఇప్పటికే ఓ సాంకేతిక కమిటీ కొవాగ్జిన్ టీకాను ఆమోదించిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. మరో కమిటీ ముందుకు ప్రతిపాదనలు వెళ్లాయని మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. టీకా అనుమతులపై తాజాగా జరిగిన సమావేశం ఆధారంగా నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.