బెల్జియం పార్లమెంట్, ప్రభుత్వ ఏజెన్సీలకు అంతర్జాల సేవలందిస్తున్న 'బెల్నెట్' సంస్థపై సైబర్ దాడి జరిగింది. తమ కస్టమర్లకు సేవల్లో అంతరాయాలు ఏర్పడినట్లు సంస్థ తెలిపింది. సైబర్ దాడి ఇంకా కొనసాగుతోందని, దశల వారిగా ఈ దాడి జరిగిందని వెల్లడించింది. సైబర్ దాడి ప్రభావం తగ్గుతున్నట్లు కనిపిస్తోందని రెండు గంటల తర్వాత ప్రకటన జారీ చేసింది బెల్నెట్. అయితే దీనిపై మరింత సమాచారం ఇవ్వలేదు.
"ఇలాంటి భారీ దాడిని ఎదుర్కోవడం మాకు ఇదే తొలిసారి. ఈ దాడులకు ప్రతిస్పందించడం చాలా కష్టం. మధ్యాహ్నం సమయానికి దాడి తీవ్ర స్థాయికి చేరింది. కానీ ఎలాంటి సమాచారం తస్కరణకు గురికాలేదు. వ్యవస్థను ధ్వంసం చేయడమే ఈ దాడుల లక్ష్యం. అంతేగానీ సమాచారాన్ని చోరీ చేయడం కాదు."
-డిర్క్ హేక్స్, బెల్నెట్ డైరెక్టర్
అయితే ఈ దాడి వెనక ఎవరున్నారనేది ఇప్పుడే చెప్పలేమని హేక్స్ పేర్కొన్నారు.
సైబర్ దాడి తర్వాత కరోనా టీకా పంపిణీ కేంద్రాల్లో ఆన్లైన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని స్థానిక మీడియా తెలిపింది. బ్రసెల్స్‌లోని ప్రాసిక్యూటర్స్ కార్యాలయంలో సమస్యలు తలెత్తినట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: బ్రిటన్‌లో సీరం సంస్థ భారీ పెట్టుబడులు