ETV Bharat / international

'పొరుగు దేశాలపై చైనా బెదిరింపులకు పాల్పడుతోంది'

కరోనా సంక్షోభాన్ని ఉపయోగించుకుని ప్రపంచాన్ని చైనా దోచుకుంటోందని మండిపడ్డారు అమెరికా విదేశాంగమంత్రి మైక్​ పాంపియో. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచానికి సహాయం చేయాల్సింది పోయి చైనా పొరుగు దేశాలను బెదిరిస్తోందని ఆరోపించారు.

Beijing using Covid crisis to bullying its neighbours, militarise South China Sea: Pompeo
'పొరుగు దేశాలపై చైనా బెదిరింపులకు పాల్పడుతోంది'
author img

By

Published : Jul 22, 2020, 5:16 AM IST

అమెరికా విదేశాంగమంత్రి మైక్​ పాంపియో మరోమారు చైనాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా సంక్షోభం సమయంలో ప్రపంచానికి సహాయం చేయాల్సింది పోయి.. పొరుగుదేశాలపై చైనా కమ్యూనిస్ట్​ పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. చైనాను ఏకాకి చేయాలని ప్రపంచ దేశాలను కోరారు పాంపియో.

ఇదీ చూడండి:- 'అన్ని దేశాలకు కరోనా వ్యాపించేలా చైనా కుట్ర'

లండన్​లో బ్రిటన్​ విదేశాంగమంత్రి డొమినిక్​ రాబ్​తో సమావేశమైన అనంతరం పాంపియో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

"కరోనా సంక్షోభాన్ని ఉపయోగించుకుని చైనా కమ్యూనిస్ట్​ పార్టీ దోచుకోవడం మొదలుపెట్టింది. ఇది ఎంతో అవమానకరమైన విషయం. ప్రపంచానికి సహాయం చేయాల్సిన సమయం ఇది. కానీ చైనా తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. హంగ్​కాంగ్​ స్వేచ్ఛను హరించింది. పొరుగుదేశాలపై బెదిరింపులకు పాల్పడుతోంది. దక్షిణ చైనా సముద్రంలో సైనిక చర్యలు చేపడుతోంది. భారత్​తో గొడవకు దిగుతోంది. అంతర్జాతీయ వ్యవస్థ సరిగ్గా ఉండాలంటే చైనా సహా ప్రపంచ దేశాలన్నీ కలిసిగట్టుగా పనిచేయాల్సిందే."

--- మైక్​ పాంపియో, అమెరికా విదేశాంగమంత్రి.

వాణిజ్య యుద్ధం, కరోనా సంక్షోభం కారణంగా అమెరికా-చైనా సంబంధాలు మరింత క్షీణించాయి. ముఖ్యంగా కరోనా వైరస్​ విజృంభణపై చైనా మీద అనేకమార్లు విరుచుకుపడింది అగ్రరాజ్యం.

బ్రిటన్​ కూడా చైనా ప్రవర్తనపై అసంతృప్తిగానే ఉంది. ముఖ్యంగా హాంగ్​కాంగ్​ స్వేచ్ఛను అణచివేస్తూ చైనా రూపొందించిన చట్టంపై బ్రిటన్​ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హువావే పరికరాలను బ్రిటన్​ 5జీ వ్యవస్థ నుంచి తొలగించాలని నిర్ణయించింది. తాజా పర్యటనలో బ్రిటన్​ నిర్ణయంపై ప్రశంసల వర్షం కురిపించారు పాంపియో.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.