ETV Bharat / international

నాగోర్నో- కరాబాఖ్‌లో ఓ గ్రామం స్వాధీనం: అజర్​బైజాన్

వివాదాస్పద నాగోర్నో- కరాబాఖ్‌ ప్రాంతం కోసం ఆర్మేనియా, అజర్​బైజాన్​ దేశాలు మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాము వివాదాస్పద ప్రాంతంలోని ఓ గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నామని అజర్​బైజాన్​ అధ్యక్షుడు పేర్కొన్నారు. మరోవైపు అజర్​బైజాన్​కు చెందిన​ 3 విమానాలను కూల్చేశామని ఆర్మేనియా చెబుతోంది.

author img

By

Published : Oct 4, 2020, 9:37 AM IST

Updated : Oct 4, 2020, 12:02 PM IST

Azerbaijan
నాగొర్న-కరబఖ్

నాగోర్నో- కరాబాఖ్‌ ప్రాంతం కోసం ఆర్మేనియా, అజర్​బైజాన్​ల మధ్య మొదలైన వివాదం తీవ్రమవుతోంది. సెప్టెంబర్​ 27న ప్రారంభమైన ఈ ఘర్షణ.. యుద్ధం పరిస్థితులను లేవనెత్తింది. అయితే శనివారం నాటికి ఈ ప్రాంతం మరింత రణరంగంగా మారింది.

ఓ గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నాం

నాగోర్నో- కరాబాఖ్​పై పట్టుకోసం ప్రయత్నిస్తోన్న చర్యలో భాగంగా.. తమ సైన్యం వివాదాస్పద ప్రాంతంలోని మడగిజ్​ గ్రామాన్ని స్వాధీనం చేసుకుందని అజర్​బైజాన్​ అధ్యక్షుడు ఇల్హం అలియెవ్​ శనివారం వెల్లడించారు.

3 విమానాలు కూల్చేశాం

శనివారం, సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో.. అజర్​బైజాన్​కి చెందిన మూడు విమానాలను ధ్వంసం చేశామని ఆర్మేనియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సుశాంత్ స్టెపానియన్​ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన అజర్​బైజాన్​ రక్షణ శాఖ.. ఆర్మేనియా మాటల్లో వాస్తవం లేదని పేర్కొంది.

150 మంది మృతి!

ఇటీవలె జరిగిన ఘర్షణలో తమ బలగాల్లోని 150 మంది మృతి చెందారని నాగోర్నో-కరాబాఖ్ అధికారులు వెల్లడించారు. అజర్​బైజాన్​ సైన్యంలో 19 మంది మృతి చెందగా, 55 మంది గాయాలపాలయ్యారని ఆ దేశ​ రక్షణ శాఖ పేర్కొందని అధికారులు తెలిపారు.

నిఘా వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. అజర్​బైజాన్​కు చెందిన 3000 మంది సైనికులు ఉద్రిక్తతలో మరణించారని నాగోర్నో-కరాబాఖ్ అధికార ప్రతినిధి వాహ్రన్​ పోఘోస్యాన్​ ఫోస్​బుక్​లో పోస్ట్ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు, వివరాలను వెల్లడించలేదు.

అసలు గొడవేంటి?

సోవియట్ యూనియన్​ విచ్ఛిన్నం కాకముందు 1991లో నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతం అజర్​బైజన్ నియంత్రణలో ఉండేది. అయితే అనంతర కాలంలో ఆ ప్రాంతానికి స్వాతంత్ర్యం లభించింది. 1992లో ఈ ప్రాంతం కోసం ఆర్మేనియా-అజర్​బైజాన్​ల మధ్య యుద్ధం జరిగింది. ఇందులో దాదాపు 30,000 మంది ప్రజలు చనిపోయారు. 1994లో యుద్ధం అంతిమ దశకు వచ్చేనాటికి ఆర్మేనియా వివాదస్పద ప్రాంతంతో పాటు దాని సమీపంలోని మడగిజ్​ను కూడా ఆక్రమించింది.

శనివారం జరిగిన ఘర్షణలో.. ఈ ప్రాంతాన్నే తాము తిరిగి స్వాధీనం చేసుకున్నామని అజర్​బైజాన్​ వెల్లడించింది.

వివాదాస్పద ప్రాంతంలో తమ బలగాల్ని ఉపసంహరించుకోవాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పలుమార్లు హెచ్చరించినా.. ఇరు దేశాలు అవి పెడచెవినపెట్టాయి. మరోవైపు, అజర్​బైజాన్​కు మద్ధతుగా టర్కీ సైన్యం నిలుస్తోందని ఆర్మేనియా తీవ్రంగా ఆరోపణలు చేస్తోంది. ఇరువురూ కలిసి ఆర్మేనియాను ఆక్రమించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని వ్యాఖ్యానించింది.

Last Updated : Oct 4, 2020, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.