స్పెయిన్లోని బాలెరిక్ ఐలాండ్ గగనతలంలో ప్రమాదం జరిగింది. హెలికాఫ్టర్, ఓ చిన్నపాటి విమానం ఢీకొన్న ఘటనలో కనీసం ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరణించినవారిలో ఓ మైనర్ ఉన్నట్లు చెప్పారు. ఘటన జరిగిన ప్రదేశంలో అత్యవసర సేవలను ఏర్పాటు చేశారు.
ప్రమాదానికి గురైన విమానం వ్యవసాయ క్షేత్రంలో పడిందని స్థానిక అధికారులు చెప్పినట్లు స్పానిష్ ప్రైవేటు మీడియాలో వార్తలొచ్చాయి.
ఇదీ చూడండి: జీ-7 సదస్సు: ప్రపంచ అగ్రనేతలతో మోదీ చర్చలు