ETV Bharat / international

ఐరోపా దేశాల్లో ఆస్ట్రాజెనెకా పంపిణీ పున:ప్రారంభం

ఐరోపా దేశాల్లో ఆగిపోయిన ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీ తిరిగి ప్రారంభమైంది. ఈ టీకా వల్ల రక్తం గడ్డకడుతోందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఐరోపా సమాఖ్య ఔషధ నియంత్రణ సంస్థ(ఈయూఎంసీ) టీకా సురక్షితమేనని నిర్ధరించింది.

AstraZeneca vaccinations resume in Europe after clot scare
ఆ దేశాల్లో ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీ ప్రారంభం
author img

By

Published : Mar 19, 2021, 10:51 PM IST

ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్నవారి శరీరాల్లో రక్తం గడ్డకడుతోందని వచ్చిన వార్తలు నిజం కావని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ప్రకటించింది. అన్నిరకాల పరీక్షల తర్వాతే టీకాను విడుదలైందని తెలిపింది. టీకా పంపిణీ తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో డజనుకు పైగా ఐరోపా దేశాలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​ పంపిణీని మళ్లీ మొదలు పెట్టాయి. కరోనాపై పోరులో ఐరోపా నేతలు అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించడం వల్లే ఇది సాధ్యమైందని పలువురు అభిప్రాయపడ్డారు.

టీకా సరఫరాలో జాప్యం వల్ల బ్రిటన్​లో​ కేసుల భయం పట్టుకుంది. ఆస్ట్రాజెనెకా తిరిగి పంపిణీ కానున్న నేపథ్యంలో బ్రిటన్​లో ఈ వారం నుంచి టీకా సమస్యలు తీరనున్నాయి. ఐరోపాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు దేశాలు లాక్‌డౌన్​ విధిస్తున్నాయి.

ఆస్ట్రాజెనెకా పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో బ్రిటన్ సహా.. ఐరోపా వ్యాప్తంగా సీనియర్ రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు టీకాలు తీసుకునేందుకు ముందుకొచ్చారు. 55ఏళ్ల వయసున్న ఫ్రాన్స్ ప్రధాని జీన్​ కాస్టెక్స్ టీకా తీసుకుంటానని ప్రకటించారు. టీకా పట్ల విశ్వాసాన్ని పెంచేందుకే టీకా తీసుకుంటున్నట్టు తెలిపారు.

ఇదీ చదవండి: ఈయూ దేశాల్లో ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీ పునఃప్రారంభం!

ఆస్ట్రాజెనెకా టీకా సురక్షితమే: ఐరోపా సమాఖ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.