తాము అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ 79 శాతం సామర్థ్యం కలిగి ఉన్నట్లు ప్రకటించింది ఆస్ట్రాజెనెకా. అమెరికాలో చేపట్టిన అడ్వాన్స్డ్ ట్రయల్స్‌లో ఈ ఫలితాలు వచ్చినట్లు పేర్కొంది.
ఈ ట్రయల్స్‌లో 30 వేల మంది వలంటీర్లు పాల్గొన్నారు. అందులో 20వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వగా.. మిగిలినవారికి డమ్మీ డోసులు ఇచ్చారు.
ఈ ఫలితాలను అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ)కు ఆస్ట్రాజెనెకా సమర్పించాల్సి ఉంది. ఈ టీకాను అత్యవసర వినియోగానికి అనుమతించే ముందు ఎఫ్‌డీఏ సలహా కమిటీ పరశీలించనుంది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 50కిపైగా దేశాలు ఆస్ట్రాజెనెకా టీకాకు అనుమతులు ఇచ్చాయి. ఆస్ట్రాజెనెకా టీకా పనితీరుపై చిన్న గందరగోళం నేపథ్యంలో అమెరికా అధ్యయన ఫలితాల కోసమే శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు.
ఇదీ చూడండి: 'కరోనా కట్టడిలో ఆక్స్ఫర్డ్ టీకా భేష్'