ETV Bharat / international

ఆశాకిరణంగా ఆక్స్​ఫర్డ్ టీకా- 70 శాతం సమర్థత

ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా 70 శాతానికిపైగా సమర్థతతో పనిచేస్తున్నట్లు తేలింది. మూడో దశ ట్రయల్స్ మధ్యంతర ఫలితాల ఆధారంగా ఈ ప్రకటన వెల్లడైంది. అన్ని సవ్యంగా జరిగితే వచ్చే నెలలో టీకాను విడుదల చేస్తామని బ్రిటన్ వైద్య శాఖ మంత్రి వెల్లడించారు. టీకా నిల్వ, రవాణా విషయంలో ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో ఆక్స్​ఫర్డ్ టీకాపైనే ప్రపంచదేశాలు ఆశలు పెట్టుకున్నాయి.

AstraZeneca
ఆక్స్​ఫర్డ్ టీకా
author img

By

Published : Nov 23, 2020, 5:38 PM IST

వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న ప్రపంచానికి ఆక్స్​ఫర్డ్ టీకా ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఆస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కరోనా​ నుంచి ఉత్తమంగా రక్షణ కల్పిస్తున్నట్లు మూడో దశ ట్రయల్స్ మధ్యంతర ఫలితాలలో వెల్లడైంది. టీకా తొలి డోసు విధానంలో 90 శాతం, రెండో డోసు విధానంలో 62 శాతం సమర్థత కనిపించింది. సగటున 70.4 శాతం సమర్థంగా పనిచేస్తోందని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది.

యూకే, బ్రెజిల్​లో కలిసి 20 వేలకుపైగా వలంటీర్లు టీకా ట్రయల్స్​లో పాల్గొన్నారు. తొలి విధానంలో భాగంగా వలంటీర్లకు ముందుగా సగం డోసు టీకా ఇచ్చి.. నెల తర్వాత పూర్తి డోసు టీకా అందించారు. రెండో విధానంలో నెల రోజుల తేడాతో రెండు పూర్తి డోసులు ఇచ్చారు. అధిక డోసు కలిగిన రెండు టీకాలను వలంటీర్లకు ఇచ్చినప్పుడు సమర్థత రేటు 62 శాతం ఉండగా... తొలుత తక్కువ డోసు అనంతరం అధిక డోసు ఇచ్చినప్పుడు టీకా సమర్థత 90 శాతంగా నమోదైంది. ఫలితాల్లో వ్యత్యాసాలపై మరింత విశ్లేషణ జరగనుంది.

స్వతంత్ర పరిశీలన కోసం మూడో దశ మధ్యంతర ఫలితాలను ఆక్స్​ఫర్డ్, ఆస్ట్రాజెనెకాలు కలిసి.. ప్రపంచంలోని అన్ని నియంత్రణ సంస్థలకు పంపించనున్నాయి. దీంతోపాటు అత్యవసర వినియోగం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతులు పొందేందుకు దరఖాస్తు చేసుకోనున్నాయి.

ప్రస్తుతం యూకేతో పాటు, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, భారత్, అమెరికా, కెన్యా దేశాల్లో టీకాపై ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరినాటికి మొత్తం 60 వేల మందిపై టీకాను ప్రయోగించాలని పరిశోధకులు భావిస్తున్నారు.

వచ్చే నెలలో విడుదల

ఆక్స్​ఫర్డ్ టీకా సమర్థంగా పనిచేస్తోందన్న ప్రకటనపై బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హర్షం వ్యక్తం చేశారు. టీకా భద్రతకు సంబంధించిన పరీక్షలు ఇంకా మిగిలి ఉన్నప్పటికీ, ఈ ఫలితాలు మాత్రం ఉత్తేజకరంగా ఉన్నాయని పేర్కొన్నారు.

దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్ అద్భుతమైన ఫలితాలు కనబర్చడం ఉత్సాహకరమైన వార్త అని బ్రిటన్ వైద్య శాఖ మంత్రి మాట్ హాన్​కాక్ అన్నారు. అన్ని ప్రణాళిక ప్రకారం జరిగితే.. వచ్చే నెలలో వ్యాక్సిన్​ను విడుదల చేస్తామని చెప్పారు. 2021 జనవరి నాటికి భారీ ఎత్తున అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.

ఇప్పటికే ఫైజర్​తో పాటు, మోడెర్నా సంస్థలు తాము తయారు చేసిన టీకా మధ్యంతర ఫలితాలను వెల్లడించాయి. ఇందులో ఫైజర్ టీకా 95 శాతం సమర్థత కనబర్చగా.. మోడెర్నా టీకా 94.5 శాతం సమర్థత చూపించింది. అయితే ఈ టీకాలతో పోలిస్తే ఆక్స్​ఫర్డ్ వ్యాక్సిన్ తక్కువ ధరకే లభించనుంది. దీన్ని నిల్వ చేయడం కూడా చాలా సులువు.

దీనిపైనే ఆశలెందుకంటే?

తమ వ్యాక్సిన్‌ సమర్థంగా పని చేస్తోందని ఫైజర్‌, మోడెర్నా సంస్థలు చేసిన ప్రకటనలు కొత్త ఆశలు రేకెత్తించినా.. పేద, మధ్యతరగతి దేశాలు మాత్రం ఆసక్తిగా వేచి చూస్తోంది మాత్రం ఈ టీకా కోసమే. కరోనా వ్యాక్సిన్‌ రేసులో తొలి నుంచి ఆక్స్‌ఫర్డ్‌ టీకానే ముందుంది. చాలా దేశాలు ముందు జాగ్రత్తగా ఆర్డర్లు ఇచ్చేశాయి. ఇందులో దాదాపు 40శాతం ఆర్డర్లు పేద, మధ్యాదాయ దేశాలకు చెందినవే. పైగా ప్రపంచ జనాభాలో అత్యధిక మంది నివసిస్తున్నది ఈ దేశాల్లోనే.

ఒక్క యూకేలోనే 3.2 బిలియన్ల ఆస్ట్రాజెనెకా డోసులు ఉత్పత్తి కానున్నాయి. వీటిని ఆసియా, పశ్చిమాసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాలోని 50 పేద, మధ్యాదాయ దేశాలకు తొలుత అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయినా, డిమాండ్‌ విపరీతంగా ఉండే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, అనుమతి లభించిన వెంటనే మిలియన్ల కొద్దీ డోసుల్ని ఉత్పత్తి చేసేలా తమ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటామని ఆస్ట్రాజెనెకా భరోసానిస్తోంది.

ధర తక్కువ

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకాపై ఆశలకు మరో కారణం దాని ధర. మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న ఈ తరుణంలో తాము లాభాలపై దృష్టి సారించేది లేదని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. ఒక్కో డోసుకు 4 నుంచి 5 డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని తెలిపింది. భారీ ఆర్డర్ల నేపథ్యంలో మూడు డాలర్ల కంటే తక్కువకు అందుబాటులోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫైజర్‌, మోడెర్నా టీకా ధరతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఫైజర్‌ టీకా ఒక్కో డోసుకు 19.50 డాలర్లు చెల్లించేందుకు అమెరికా ఒప్పందం ఖరారు చేసుకుంది. చిన్న ఆర్డర్లకు ఒక్కో డోసుకు మోడెర్నా 32 నుంచి 37 డాలర్లు వసూలు చేస్తామని ప్రకటించింది. భారీ ఆర్డర్లయితే ఈ ధర 25 నుంచి 27 డాలర్లు ఉండనున్నట్లు సమాచారం.

నిల్వ, రవాణా సులభం

ధరతో పాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న తయారీ సంస్థలు ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తికి ఇప్పటికే అంగీకారం తెలపడం మరో అదనపు ప్రయోజనం. దీంతో వ్యాక్సిన్‌ రవాణా సులభతరమవుతుంది. భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆక్స్‌ఫర్డ్‌ టీకా ఉత్పత్తికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే లక్షలాది టీకా డోసుల తయారీపై నిమగ్నమైంది. పైగా ఫైజర్‌, మోడెర్నాతో పోలిస్తే ఆక్స్‌ఫర్డ్‌ టీకాను మరీ అతిశీతల ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే పేద, మధ్యాదాయ దేశాలు ఈ టీకాపైనే దృష్టి సారించాయి. వీటితో పాటు చైనాలో అభివృద్ధి చేస్తున్న ఓ వ్యాక్సిన్‌, రష్యాకు చెందిన స్పుత్నిక్‌ టీకాపైనా ఆయా దేశాలు ఆశలు పెట్టుకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.