ETV Bharat / international

'అలా చేయకుండా ఆంక్షలు సడలిస్తే అంతే ఇక!' - corona virus news

అనేక దేశాలు లాక్‌డౌన్‌ ఆంక్షల్ని సడలిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన కీలక అధికారి హెచ్చరికలు చేశారు. పూర్తి స్థాయిలో కాంటాక్ట్ ట్రేసింగ్​, నిర్ధరణ పరీక్షలు చేపట్టకుండా గుడ్డిగా ముందుకెళితే ప్రమాదమని హితవు పలికారు.

VIRUS-WORLD-REOPEN-WARNING
ఆంక్షల సడలింపు
author img

By

Published : May 12, 2020, 2:30 PM IST

రాబోయే కాలంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రపంచ దేశాలకు హితవు పలికింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. లేదంటే రెండోసారి మహమ్మారి విజృంభణకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఏర్పడొచ్చని హెచ్చరించింది.

కరోనా వైరస్ ఓ వైపు విజృంభిస్తోన్నా ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణకు ప్రపంచ దేశాలు సిద్ధమవుతున్నాయి. ఫ్రాన్స్​, బెల్జియం లాక్​డౌన్​లను ఎత్తివేశాయి. నెదర్లాండ్స్ పాఠశాలలను ప్రారంభించగా.. అమెరికా వాణిజ్యంపై ఆంక్షలు సడలించటంలో ముందు వరుసలో ఉంది. ఈ నేపథ్యంలో తాజా హెచ్చరికలు చేసిన డబ్ల్యూహెచ్​ఓ.

మళ్లీ విజృంభణ..

విస్తృత స్థాయిలో పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టకుండా సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఇస్తే వైరస్ మరింత విజృంభించే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆంక్షల ఎత్తివేత తర్వాత జర్మనీ, చైనాలోని వుహాన్​ నగరం, దక్షిణ కొరియాలో కేసుల పెరుగుదుల ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది.

గుడ్డిగా వెళితే ఎలా..

ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగం చీఫ్​ డాక్టర్ మైఖేల్ ర్యాన్​ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. వైరస్ కాంటాక్ట్​ ట్రేసింగ్​కు సంబంధించి పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు.

"జర్మనీ, దక్షిణ కొరియా దేశాలు కాంట్రాక్ట్​ ట్రేసింగ్​లో అవలంబించిన చర్యలు నమ్మకాన్ని కలిగించాయి. వైరస్​ క్లస్టర్లను ముందే గుర్తించి వ్యాప్తిని అడ్డుకున్నాయి. కానీ కొన్ని దేశాలు లాక్​డౌన్​లో ఉన్నప్పటికీ సరైన కాంటాక్ట్ ట్రేసింగ్ చర్యలు చేపట్టలేదు. బాధితులతో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి వారు వైరస్​ను వ్యాప్తి చేయకముందే క్వారంటైన్​లో ఉంచాల్సిన అవసరం ఉంది."

- మైఖేల్ ర్యాన్​

పేర్లను ప్రస్తావించకుండా కొన్ని దేశాలను, ముఖ్యంగా అమెరికాను ఉద్దేశించి గుడ్డిగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు ర్యాన్​. వైరస్​ విజృంభిస్తోన్నా తాము విజయం సాధించామన్న భ్రమలో ఉన్నారని విమర్శించారు. వైరస్​ మరింత విజృంభించే అవకాశం ఉందని ర్యాన్​ హెచ్చరించారు.

ఇదీ చూడండి: చైనాతో రెండోదశ వాణిజ్య చర్చలకు ట్రంప్ నో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.