ETV Bharat / international

ఆర్మేనియా- అజర్‌బైజాన్‌ల మధ్య శాంతి పవనాలు! - turkey involvement in Armenia Azerbaijan

రష్యా మధ్యవర్తిత్వంతో ఆర్మేనియా, అజర్​బైజాన్​ల మధ్య ఉద్రిక్తతలు.. తగ్గినట్లు కనిపిస్తున్నాయి. వివాదాస్పద నాగోర్నో-కరాబఖ్​ ప్రాంతంపై ఆధిపత్యం కోసం.. కొన్నిరోజులుగా పరస్పర దాడులతో హడలెత్తించాయి ఈ దేశాలు. ఇప్పుడు ఈ ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించాయి.

Armenia Azerbaijan agree on cease fire in Nagorno Karabakh
ఆర్మేనియా- అజర్‌బైజాన్‌ల మధ్య శాంతి పవనాలు!
author img

By

Published : Oct 10, 2020, 10:47 AM IST

వివాదాస్పద నాగోర్నో-కరాబఖ్‌ ప్రాంతంపై ఆధిపత్యం కోసం ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ దేశాల మధ్య జరుగుతున్న పోరు సద్దుమణిగినట్లే కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నట్లు.. ఇరు దేశాల దౌత్యవేత్తలు ప్రకటించారు. రష్యా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు ఈ అభిప్రాయానికి వచ్చాయి.

10 గంటల పాటు చర్చలు..

ఖైదీల మార్పిడి సహా మృతదేహాల అప్పగింతకు సంధి కుదిరిందని.. మరిన్ని అంశాలపై తర్వాతి కాలంలో ఏకాభిప్రాయానికి వస్తామని తెలిపారు. ఈ మేరకు ఆర్మేనియా-అజార్‌బైజాన్‌ దేశాల ప్రతినిధులతో... రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ సమక్షంలో మాస్కోలో సమావేశమయ్యారు. 10 గంటల పాటు చర్చలు జరిపారు.

'వివాదం సమిసిపోతుంది'

వివాదం సమసిపోవడానికి కాల్పుల విరమణ ఒప్పందం.. బాటలు వేస్తుందన్నారు రష్యా విదేశాంగ మంత్రి మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌. నాగోర్నో-కరాబఖ్‌ ప్రాంతం కోసం ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ దేశాల మధ్య కొన్ని రోజులుగా భీకర పోరు సాగుతోంది. ఈ ప్రాంతం అజార్‌బైజాన్‌లోనే ఉన్నప్పటికీ.. ఆర్మేనియన్‌ దళాల నియంత్రణలో ఉంది.

ఇదీ చూడండి:యుద్ధమేఘాలు: ఆర్మేనియా- అజర్‌బైజాన్‌ వివాదమేంటి ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.