ETV Bharat / international

కొవిడ్‌ చికిత్సతో పెరగనున్న యాంటీబయాటిక్‌ నిరోధకత

కరోనా బాధితులకు చికిత్స అందించే యాంటీ బయాటిక్స్​ వల్ల పరిసర ప్రాంతాల్లోని నదులు, సముద్ర జలాల్లో ఈ ఔషధ పరిమాణం పెరగొచ్చని బ్రిటన్​ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. దీని వల్ల ప్రజల్లో యాంటీ మైక్రోబియల్​ నిరోధకత పెరిగి.. యాంటీబయాటిక్స్​ను ఎదుర్కొనే శక్తి బ్యాక్టీరియాకు కలుగుతుందని అన్నారు.

Antibiotic resistance may increase with covid treatment
కొవిడ్‌ చికిత్సతో పెరగనున్న యాంటీబయాటిక్‌ నిరోధకత
author img

By

Published : Aug 26, 2020, 9:02 AM IST

కొవిడ్‌-19 బాధితులకు యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయడం వల్ల సమీపంలోని నదులు, సముద్ర తీర జలాల్లో ఈ ఔషధాల పరిమాణం పెరగొచ్చని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనివల్ల ప్రజల్లో యాంటీ మైక్రోబియల్‌ నిరోధకత పెరుగుతుందని చెప్పారు. ఫలితంగా యాంటీబయాటిక్స్‌ను తట్టుకొనే సామర్థ్యం బ్యాక్టీరియాకు వస్తుందన్నారు. కరోనా సోకి ఆసుపత్రిపాలైన వారికి బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు సోకకుండా పలు ఔషధాలను ఇస్తున్నారు. ఇలాంటివారిలో 95 శాతం మందికి యాంటీబయాటిక్స్‌ను సూచిస్తున్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి బాధితుల విసర్జితాల ద్వారా ఆసుపత్రుల్లోని వ్యర్థాల శుద్ధి వ్యవస్థను కూడా దాటి వెళతాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. నీటి వనరుల్లో కలిసే ప్రమాదం ఉందన్నారు.

కొవిడ్‌ బాధితులు అధికంగా ఉన్న ఆసుపత్రుల్లోని వ్యర్థ జలాల నిర్వహణ వ్యవస్థల నుంచి వచ్చే నీరు కలిసే చోట ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఫలితంగా తీర ప్రాంత జలాల్లో యాంటీబయాటిక్స్‌ స్థాయి పెరుగుతుందన్నారు. దీనివల్ల యాంటీ మైక్రోబియల్‌ నిరోధకత (ఏఎంఆర్‌) పెరుగుతుందని చెప్పారు. నదీ జలాల శుద్ధి వ్యవస్థలపై కూడా భారం పడుతుందని వివరించారు.

ఇదీ చూడండి:'వైరస్‌ వ్యాప్తికి బాధ్యతా రాహిత్య వ్యక్తులే కారణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.