జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో ఎలాంటి అనుమతి తీసుకోకుండా 42 అంతస్తుల ‘స్కైపర్ టవర్’ భవంతి ఎక్కినందుకు రాబర్ట్‌ను అరెస్టు చేశారు పోలీసులు. ఎక్కేసమయంలో కనీస భద్రతా ప్రమాణాలు కూడా పాటించలేదని తెలిపారు. 57 ఏళ్ల రాబర్ట్ 500 అడుగుల ఎత్తైన భవంతిపైకి కేవలం అరగంటలో చేరుకున్నాడని చెప్పారు. భవనం ఎక్కే సమయంలో రోడ్లపై వెళ్లేవారు భారీ సంఖ్యలో నిలబడి అతణ్ని ఫోటోలు తీశారని.. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడినట్లు చెప్పారు.
1994 నుంచి...
ఫ్రాన్స్‌కు చెందిన అలైల్ రాబర్ట్ 1994 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎత్తైన భవనాలను ఎక్కుతూ స్పైడర్ మ్యాన్‌గా ప్రాచుర్యం పొందారు. ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా పేరుగాంచిన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా, పారిస్‌లోని ఈఫిల్ టవర్‌నూ ఎక్కారు. హాంకాంగ్‌లో హింసాత్మక నిరసనలు చెలరేగినప్పుడు గత ఆగస్టులో రాబర్ట్ ఓ ఆకాశ హార్మ్యాన్ని ఎక్కి శాంతి చిహ్నం బ్యానర్‌ను ప్రదర్శించారు.
ఇదీ చూడండి: 'దివాలా'తో సొంతగూటికి థామస్‌కుక్ కస్టమర్లు!