ETV Bharat / international

ఆ 27దేశాల్లో ఒకేరోజు టీకా పంపిణీ ప్రారంభం!

ఐరోపా సమాఖ్య(ఈయూ)కు చెందిన 27 దేశాల్లో ఒకేరోజు వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం కానున్నట్లు ఇటలీలో కరోనాపై నియమించిన ప్రత్యేక కమిషనర్ డొమెనికో అర్క్యూరీ‌ వెల్లడించారు. ఆ రోజునే అన్ని దేశాలు వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభిస్తాయన్నారు.

All EU nations to start vaccinations on same day
ఆ 27దేశాల్లో ఒకేరోజు టీకా పంపిణీ ప్రారంభం!
author img

By

Published : Dec 13, 2020, 10:41 PM IST

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్​ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ పంపిణీకి దేశాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు అత్యవసర వినియోగం కింద కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ మొదలుపెట్టాయి. ఇక కరోనా ధాటికి వణికిపోతోన్న ఐరోపాలోనూ వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే, ఐరోపా సమాఖ్య(ఈయూ)కు చెందిన 27దేశాల్లో ఒకేరోజు వ్యాక్సిన్‌ ప్రారంభమవనున్నట్లు ఇటలీలో కరోనా మహమ్మారిపై నియమించిన ప్రత్యేక కమిషనర్ డొమెనికో అర్క్యూరీ‌ వెల్లడించారు. ఆ రోజునే అన్ని దేశాలు వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభిస్తాయని.. అనంతరం ఆయా దేశాలు వాటిని కొనసాగిస్తాయని పేర్కొన్నారు. అయితే, వ్యాక్సిన్‌ పంపిణీ ఏ రోజు ప్రారంభం అవుతుంది, ఆ రోజు ఎంతమందికి వ్యాక్సిన్‌ ఇస్తారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. భారీ స్థాయిలో చేపట్టే వ్యాక్సినేషన్‌ కన్నా ముందు రోజే ఒకేసారి అన్ని దేశాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ ఉంటుందని ప్రకటించారు.

ఇటలీలో తొలిదశలో 18లక్షల ఆరోగ్య సంరక్షణ, నర్సింగ్‌ హోం సిబ్బందికి వ్యాక్సిన్‌ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారీ ఎత్తున చేపట్టే వ్యాక్సిన్‌ పంపిణీ కోసం నగరంలోని 300 మైదానాలతో పాటు బహిరంగ ప్రదేశాలను సిద్ధం చేస్తున్నారు. ఈయూ‌లో జనవరి రెండో వారంలో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇదీ చూడండి: లంగ్స్‌పై కరోనా ప్రభావం..శాస్త్రవేత్తల డీకోడ్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.