లిబియా నుంచి యూరప్‌నకు శరణార్థులను తీసుకెళ్తున్న ఓ చిన్న పడవ మధ్యదరా సముద్రంలో అదృశ్యమైనట్లు ఐరాస శరణార్థుల ఏజెన్సీ తెలిపింది. పడవలో 91 మంది ఉన్నట్లు తెలిపింది. లిబియా రాజధాని ట్రిపోలీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ ఖర్‌బౌలీ తీరం నుంచి ఫిబ్రవరి 8 న బయలుదేరిన ఓ రబ్బరు డింగీ సమాచారం తెలియడం లేదని వెల్లడించింది.
అలారం ఫోన్ ద్వారా...
పడవలో ఎక్కువగా నైజర్, మాలి, సుడాన్, ఇరాన్ దేశాలకు చెందినవారున్నట్లు తెలుస్తోంది. సముద్రం మధ్యన ప్రమాదంలో ఉన్నప్పుడు సంకేత భాష ద్వారా సమాచారం అందించే అలారం ఫోన్‌తో విషయం తెలిసినట్లు లిబియా తీరప్రాంత అధికారులు తెలిపారు. పడవ ఆచూకీ తెలుసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: 'కట్-కాపీ-పేస్ట్' ఆవిష్కర్త మృతి.. సిలికాన్ వ్యాలీ సంతాపం