గురువారం కురిసిన వర్షాలతో స్పెయిన్ అతలాకుతలమైంది. భారీ వరద ప్రవాహంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఓంటినెంట్, వాలెన్సియా ప్రాంతాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. 24 గంటల్లో 300 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసిందని అంచనా వేస్తున్నారు అధికారులు. 1917 తర్వాత ఇదే అత్యధికమని భావిస్తున్నారు. రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. పలువురు గల్లంతయ్యారు. వరద ప్రవాహానికి కార్లు, ట్రక్కులు కొట్టుకుపోయాయి. చెట్లు నేలకూలాయి.
అత్యవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటికి రావద్దని ప్రజలకు సూచించింది వాతావరణ శాఖ. శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ముందు జాగ్రత్తగా స్థానిక పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు.