ETV Bharat / international

90ఏళ్లలో పర్వతం ఎక్కుతున్న బామ్మ.. ఎలాగంటే.. - UK Climbers news updates

వయసు మీద పడిందంటే ఇక పనైపోయినట్లే అనుకొని ఇంటికే పరిమితమవుతుంటారు చాలామంది. కానీ సంకల్పం గట్టిదైతే వయసుతో పనిలేదని నిరూపిస్తోంది బ్రిటన్​కు చెందిన 90 ఏళ్ల బామ్మ. స్వచ్ఛంద సేవాసంస్థల కోసం పోరాటం చేస్తోన్న ఆమె సాహసానికి మెచ్చి.. ఆ దేశ యువరాజు ఛార్లెస్​ మద్దతు ప్రకటిస్తూ లేఖ రాశారు.

90-year-old UK woman climbs stairs to raise money
ఇంట్లోని మెట్లెక్కుతూ.. 90ఏళ్ల బామ్మ పర్యతారోహణ!
author img

By

Published : Jun 14, 2020, 3:07 PM IST

90 ఏళ్ల వయసంటే.. సరిగా నడవడానికే చాలా కష్టం. అలాంటిది.. స్వచ్ఛంద సేవా సంస్థలకు నిధులు సమకూర్చేందుకు ఏకంగా స్కాటిస్​ పర్యతాన్నే అధిరోహించేందుకు సిద్ధమైంది బ్రిటన్​లోని స్కాటిస్​ హైల్యాండ్స్​కు చెందిన మార్గరెట్ పైనీ అనే బామ్మ. అయితే అది ప్రత్యక్షంగా కాదు.. తన ఇంట్లోని మెట్లెక్కుతూ ఈ ఫీట్​ అందుకోవాలని ప్రయత్నిస్తోంది.

ఇంట్లోని మెట్లెక్కుతూ.. 90ఏళ్ల బామ్మ పర్యతారోహణ!

ప్రిన్స్ ప్రశంసలు..

తొమ్మిది పదుల వయసులోనూ సామాజిక దృక్పథంతో ఆలోచించి తనంతట తానుగానే ఈ ఛాలెంజ్​ చేసుకుంది మార్గరెట్​. అంతేకాదు రెండు నెలల్లోనే 3.9 లక్షల పౌండ్ల(4,89,235 యూఎస్​ డాలర్లు) నిధులు సైతం సేకరించి బ్రిటన్​ ప్రిన్స్ నుంచి ప్రశంసా ఉత్తరాన్ని అందుకుంది. ఈ నిధులను ఎన్​హెచ్ఎస్​, హైల్యాండ్స్​ హోస్పైస్​ అండ్​ ది రాయల్​ నేషనల్​ లైఫ్​బోట్​ ఇన్​స్టిట్యూషన్​కు అందించనుంది.

ఎన్​హెచ్​ఎస్​ కోసం ఇదివరకే ఎన్నో మిలియన్​ పౌండ్ల నిధులు సేకరించిన సర్ కాప్టెన్​ టామ్​.. ఆదర్శంతో ఈస్టర్​ రోజున ఈ ప్రయత్నం మొదలు పెట్టినట్లు వెల్లడించింది మార్గరెట్​. 10 నుంచి 12 వారాల్లో ఈ ఛాలెంజ్​ను పూర్తి చేస్తానని చెప్పుకొచ్చిందీ బామ్మ.

ఇదీ చదవండి: 'యోగా ఫ్రమ్​ హోం'కు అమెరికన్లు సన్నద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.