ETV Bharat / international

భార్యాబిడ్డలు, అత్తను చంపి.. ఇంటికి నిప్పుపెట్టి.. - ఆత్మహత్య

జర్మనీలో ఘోరం జరిగింది. వివాహ సమస్యలతో ఓ వ్యక్తి తన భార్యా బిడ్డలను, అత్తను కత్తితో పొడిచి చంపాడు. ఆపై ఇంటికి నిప్పుపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.

5 found dead after stabbings, fire at house in Germany
భార్యబిడ్డలను, అత్తను చంపి.. ఇంటికి నిప్పుపెట్టి..
author img

By

Published : Feb 13, 2021, 10:33 PM IST

జర్మనీలో శనివారం అమానుషం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలు, అత్తను కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత ఇంటికి నిప్పుపెట్టి, తానూ పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉపెర్​టల్​ పట్టణం​లోని రాడవోన్​వాల్డ్​లో ఓ ఇంటిలో అగ్ని ప్రమాదం జరిగిందనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఐదు మృత దేహాల్ని కనుగొన్నారు. మృతులను 41 ఏళ్ల వ్యక్తి, 37 సంవత్సరాల అతని భార్య, ఏడాది పాప, నాలుగేళ్ల పాపతో పాటు77ఏళ్ల అత్తగా గుర్తించారు.

వైవాహిక సమస్యల కారణంగానే భార్యా పిల్లల్ని, తన అత్తను అతడు కత్తితో పొడిచి చంపాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఇంటికి నిప్పు పెట్టి తాను కత్తితో పొడుచుకొని చనిపోయాడని వెల్లడించారు.

ఇదీ చూడండి: బావిలో పడిన చిన్నారి- కాపాడిన 'వైట్ ​హెల్మెట్స్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.