ETV Bharat / international

వారం తర్వాతే రష్యా వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగం!

author img

By

Published : Aug 16, 2020, 5:13 PM IST

ఇటీవలే ఆమోదం పొందిన రష్యా వ్యాక్సిన్.. మూడో దశ పరీక్షలకు సిద్ధమైంది. మరో 7-10 రోజుల్లో ఈ ప్రయోగం మొదలుకానుంది.

3rd stage of Russia's Covid-19 vaccine may begin in 7-10 days
రష్యా వ్యాక్సిన్ ఆఖరి దశ ప్రయోగం వారం తర్వాతే!

రష్యా ఆమోదం తెలిపిన 'స్పుత్నిక్- వీ' కరోనా వ్యాక్సిన్​ మూడో దశ పరిశోధన మరో 7-10 రోజుల్లో ప్రారంభం కానుందని ఓ నివేదిక తెలిపింది. స్థానిక వార్తా సంస్థ ప్రకారం... గమలేయా శాస్త్రీయ పరిశోధనా సంస్థ చేపట్టే ఈ ప్రయోగం మాస్కో ప్రాంతంలో జరుగనుంది. ఇందులో వేలాది మంది వాలంటీర్లు పాల్గొననున్నారు.

"మా సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్​కు ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది. కానీ, ప్రొటోకాల్ ప్రకారం అన్ని పరిశోధనలు పూర్తి చేయాలి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎలాంటి ఆలస్యం లేకుండా తదుపరి, చివరి ప్రయోగానికి అనుమతులిస్తుందని ఆశిస్తున్నాం. వారం, పది రోజుల్లో ఈ ప్రక్రియ మొదలవుతుంది. "

-గింట్స్ బర్గ్, గమలేయా సంస్థ డైరెక్టర్.

మూడో దశ పరీక్షలు నిర్వహించకుండానే.. వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించింది రష్యా. పైగా ముందు రష్యా పౌరులకు వ్యాక్సిన్ అందాకే, ఇతర దేశాలకు ఇస్తామని ప్రకటించింది. అయితే స్పుత్నిక్- వీ వ్యాక్సిన్ ఎంతవరకు సురక్షితం అని తేలేది మాత్రం మూడో దశ ఫలితాలు వచ్చాకేనని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్​ ఉత్పత్తిని ప్రారంభించిన రష్యా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.