ఉన్నత విద్యకోసం ఉక్రెయిన్‌కు వెళ్లిన ఓ 21ఏళ్ల యువకుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. కర్ణాటకలోని బీదర్ జిల్లా హక్యాల తాండాకు చెందిన అజయ్ రాథోడ్ గతేడాది డిసెంబరు 14న ఉక్రెయిన్‌కు వెళ్లాడు. జనవరి 16న అజయ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బాధితుడిని కిర్గిస్థాన్‌కు తరలించారు. దుండగులు బాధితుడి కుటుంబసభ్యుల నుంచి కోటి రూపాయలు డిమాండ్ చేశారు. డబ్బు చెల్లించకపోతే అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో విడిచిపెట్టేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
ఎట్టకేలకు..
అజయ్ కిడ్నాప్‌పై ఆందోళ చెందిన తల్లిదండ్రులు బీదర్ ఎస్పీ డీ.ఎల్ నగేష్‌కు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఉక్రెయిన్ రాయబార కార్యాలయ అధికారుల సాయంతో బాధితుడిని దుండగుల చెర నుంచి రక్షించారు. అజయ్ త్వరలో భారత్‌కు తిరిగి వస్తాడని బంధువులు వెల్లడించారు.
ఇదీ చదవండి : ట్రంప్‌పై విమర్శల జడివాన స్వయంకృతమే!