ఉక్రెయిన్ ఖర్కివ్ నగరంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 15మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు అంతస్తుల నర్సింగ్‌హోంలో ఉన్న రోగులందరూ బలహీనంగా ఉంటారని, ఆ వృద్ధ మహిళలకు కనీసం నడవడానికి కూడా శక్తి ఉండదని స్థానికులు తెలిపారు.
అయితే ఈ ఘటనకు కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. నివాస భవనాన్నే నర్సింగ్హోంగా మార్చి నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇది అధికారికంగా రిజిస్టర్ కాలేదని చెప్పారు.
ఇదీ చూడండి: ట్రంప్ ఖాతాలపై ఫేస్బుక్ స్వతంత్ర కమిటీదే నిర్ణయం!