ETV Bharat / international

50% డిస్కౌంట్​ ఇస్తే.. నెలలో 10 కోట్ల భోజనాలు తినేశారు!

కరోనా వైరస్ వల్ల రెస్టారెంట్లలో తినేందుకు చాలా మంది భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను రెస్టారెంట్లకు రప్పించేందుకు ఆ ప్రభుత్వం సరికొత్త ఆఫర్​ ప్రకటించింది. దీన్ని వినియోగించుకొని ఆగస్టులో 10 కోట్ల భోజనాలు సేల్​ అయ్యాయి. ఇంతకీ ఈ ఆఫర్​ ఎక్కడ ప్రకటించారు? ఆఫర్​ వివరాలు ఏమిటి? అనేగా మీ సందేహం. అయితే ఈ స్టోరీ చదివేయండి.

UK plan for comback restaurants
డిస్కౌంట్లతో 10 కోట్ల భజోనలు తిన్న బ్రిటన్ ప్రజలు
author img

By

Published : Sep 4, 2020, 11:57 AM IST

కరోనా విజృంభణతో చాలా రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. అందులో హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపారాలు కూడా ముఖ్యమైనవి. ఇవి ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నా.. వినియోగదారులు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నారు. అయితే రెస్టారెంట్లకు ప్రజలను రప్పించేందుకు బ్రిటన్​ ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.

అదే "ఈట్ ఔట్ హెల్ప్​ఔట్​". ఈ ఆఫర్​ ప్రవేశపెట్టిన తర్వాత ప్రజలు కేవలం ఆగస్టు నెలలో 10 కోట్ల డిస్కౌంట్​ డైనింగ్​లు చేశారు. బ్రిటన్ ట్రెజరీ విభాగం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఆఫర్​ను వినియోగించుకునేందుకు సెప్టెంబర్ చివరి వరకు గడువు ఉంది. అయితే ఇప్పటికే ఈ ఆఫర్​ దెబ్బకు తమ అంచనాలు దాటేసినట్లు పేర్కొంది ట్రెజరీ విభాగం.

ఇంతకీ ఏమిటి ఈ ఆఫర్​..

"ఈట్ ఔట్ హెల్ప్​ ఔట్​" పథకం కింద ప్రజలు రెస్టారెంట్లలో భోజనం చేయడం ద్వారా.. ఫుడ్, నాన్​ ఆల్కహాలిక్ డ్రింక్స్​పై 50 శాతం (దాదాపు 10 ఫౌండ్లు )వరకు ప్రభుత్వం నుంచి డిస్కౌంట్ పొందొచ్చు. సోమవారం నుంచి బుధవారం మధ్య ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.

మిషెలిన్ స్టార్​ ​ఔట్​లెట్లు మొదలుకొని.. అంతర్జాతీయ బర్గర్ ఫ్రాంఛైజీల్లో చేసే డైనింగ్​ల వరకు ఈ ఆఫర్​ వర్తిస్తుంది. డైనింగ్ చేసిన 5 రోజుల్లో ప్రభుత్వం నుంచి రీఫండ్ లభిస్తుంది. అయితే ఈ ఆఫర్​కు ఆగస్టు చివరి నాటికి 500 మిలియన్ పౌండ్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినప్పటికీ.. 22 మిలియన్ పౌండ్ల భారం అధికంగా పడినట్లు బ్రిటన్ ట్రెజరీ విభాగం పేర్కొంది.

ఆఫర్​పై విమర్శలు..

కరోనా సంక్షోభంలో ప్రజలను బయట తినేలా ప్రోత్సహించడం సరైంది కాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇది తాత్కాలికంగా ప్రజలను బయట తినేందుకు ప్రేరేపించే జిమిక్కు మాత్రమేనని మరికొందరు విమర్శిస్తున్నారు.

శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశాలుండటం వల్ల చాలా మంది ఇంట్లోనే తినేందుకు ఇష్టపడతారు. ఇలాంటి పరిస్థితుల్లో రెస్టారెంట్లు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని.. ఈ పథకం పెద్దగా ప్రభావితం చేయలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దక్షిణ లండన్​లోని లోరెన్జో ఇటాలియన్ రెస్టారెంట్ల కో-డైరెక్టర్​ లోరెన్జో నార్గి.. ఈ ఆఫర్​తో తమ వ్యాపారాలను దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. డిస్కౌంట్​ ఇచ్చే రోజులతో పోలిస్తే.. మిగత రోజుల్లో రెస్టారెంట్లకు వచ్చేవారి సంఖ్య భారీగా తగ్గినట్లు తెలిపారు. ఈ కారణంగా ఆదాయం భారీగా పడిపోతున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:ఒకే వ్యక్తి రెండుసార్లు ఓటేయాలట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.